ఒక్కొక్క పోస్టుకు ఇద్ద‌రేసి.. ఉద్యోగాల‌ను త‌ల‌పిస్తున్న మంత్రి వ‌ర్గం!

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నిరుద్యోగులు పోటి ప‌డి న‌ట్టే.. ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల కోసం నాయ‌కుల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన పోటీ ఉంది.

Update: 2024-09-11 15:30 GMT

తెలంగాణ స‌ర్కారులో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి ప‌ద‌వుల విష‌యంలో సీనియ‌ర్ల నుంచి ఒకింత ప‌లుకు బ‌డి ఉన్న వారి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ పోటీ ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నిరుద్యోగులు పోటి ప‌డి న‌ట్టే.,. ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల కోసం నాయ‌కుల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన పోటీ ఉంది. కొంద‌రికి నేరుగా అధిష్టానంతో సంబంధాలు ఉండ‌డంతో అటు నుంచి న‌రుక్కువ స్తున్నారు. మ‌రికొంద‌రు రేవంత్‌నే త‌మ నాయ‌కుడిగా పేర్కొంటూ.. ఆయ‌న‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇంకొందరు ప‌నితీరు.. విధేయ‌త‌ను న‌మ్ముకున్నారు. ఎలా చూసినా.. ఆరుస్థానాల‌కు 15 మంది వ‌ర‌కు నాయ‌కులు పోటీ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా పార్టీ మారిన వారు కూడా ఈ జాబితాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యంలో రేవంత్ రెడ్డి గ‌తంలోనే ఒక స్ప‌ష్ట‌త ఇచ్చారు. పార్టీలు మారి వ‌చ్చిన వారికి మంత్రి పీఠాలు ఎలా ఇస్తాం అంటూ.. వ్యాఖ్యానించారు. సీనియ‌ర్లు లేరా.. వారు చేసిన ప‌నులు మ‌రిచిపోతామా? అని కూడా వ్యాఖ్యానించారు. అయినా.. జంపింగులు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు.

వీరిలో ఖైత‌రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు బాగానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని స‌మాచారం. ఆయ‌న‌కు ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. ఇప్పుడు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక‌, సుదీర్ఘ రాజ‌కీయ వార స‌త్వం ఉన్న కాకా.. త‌న‌యులు.. గ‌డ్డం వివేకానంద ఆయ‌న సోద‌రుడు కూడా మంత్రి పీఠాల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. వీరు అధిష్టానంతోనే మాట్లాడుకున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌, సీనియ‌ర్ నేత షబ్బీర్ అలీలు కూడా ముందంజ‌లో ఉన్నారు. మైనారిటీ కోటాలో వీరిలో ఒక‌రికి ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. త‌మకంటే త‌మ‌కేన‌ని ఇద్ద‌రూ చెబు తున్నారు. అదేస‌మ‌యంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా త‌న‌కు వ‌రించ‌బోతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇక‌, రెడ్డి కోటాలో ఇప్ప‌టికే చాలా మందికి అవ‌కాశం ఇచ్చారు. అయినా.. కూడా మ‌రికొంద‌రు రెడ్లు క‌ర్చీఫ్‌లు వేసుకున్నారు.

వీరిలో సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఈయ‌న అన్న వెంక‌ట రెడ్డి మంత్రిగా ఉన్నారు. అయినా.. ఈయ‌న కూడా ఆశిస్తున్నారు. ఈయ‌న‌కు ద‌క్క‌క పోవ‌చ్చ‌ని స‌మాచారం), ఇక‌, బీసీ కోటాలో మక్తల్ ఎమ్మె్ల్యే శ్రీహరి ముదిరాజ్ కూడా లైన్‌లో ఉన్నారు. వీరే కాకుండా.. ఎస్టీ, ఎస్సీ కోటాలోనూ మ‌రింత మంది నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. మ‌రి ఎవ‌రికి ప‌ద‌వి వ‌రిస్తుందో చూడాలి.

Tags:    

Similar News