సిమ్ కార్డులపై కఠినమైన నిబంధనలు.. ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్ట్!
అవును... సిమ్ కార్డుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరంలో సరికొత్త నిబంధనలు తెరపైకి రానున్నాయని అంటున్నారు.
నూతన సంవత్సరం రాబోతున్న వేళ ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... నూతన సంవత్సరంలో టెలికాం ప్రపంచానికి ఎన్నో మార్పులు తీసుకురాబోతోందని అంటున్నారు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగించే యూజర్లకు ఈ కొత్త నిబంధనలూ వర్తించనున్నాయని అంటున్నారు.
అవును... సిమ్ కార్డుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరంలో సరికొత్త నిబంధనలు తెరపైకి రానున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... కొత్త సిమ్ కార్డుల జారీ విషయంలో కీలక కండిషన్స్ తెరపైకి తేబోతుందని చెబుతున్నారు. సైబర్ మోసాలను నియంత్రించడానికి కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
ఈ నేపథ్యంలో.. ఎవరి మీద సిమ్ కార్డులు జారీ చేయకూడదో నిషేధిత జాబితాను రూపొందించిందని అంటున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుందంట. తద్వారా సుమారు మూడేళ్ల వరకూ సిమ్ కార్డుల నిషేధాన్ని విధించనున్నారు.
దీనికి ప్రధాన కారణం... కోట్లాది మంది మొబైల్ యూజర్లను రక్షించడానికి, సిమ్ కార్డ్ దుర్వినియోగంతో ముడిపడిన సైబర్ నేరాలను నిరోధించడానికి టెలీకమ్యునికేషన్స్ విభాగం చర్యలను ప్రారంభించింది. తద్వారా ఇతర పేర్లతో సిమ్ లు పొందడం, తద్వారా మోస పూరిత పనులకు ఒడిగట్టడానికి చెక్ పెట్టాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా టెలీకమ్యునికేషన్స్ శాఖ బ్లాక్ లిస్టులోని యూజర్ల వివరాలను ముందుగా బ్లాక్ చేస్తారట. అనంతరం ఆ వ్యక్తి పేరు మీద మూడేళ్ల వరకూ కొత్త సిమ్ కార్డు జారీ చేయరని అంటున్నారు. చర్య తీసుకునే ముందు.. ఆ తరహా వక్తులకు ప్రభుత్వం నోటీసు కూడా పంపుతుందని చెబుతున్నారు. దీనికి వారు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి!
అయితే... కొన్ని సందర్భాల్లో మాత్రం అంటే.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు కేసుల్లో ఎలాంటి నోటీసులు పంపకుండా చర్యలు తీసుకుంటామని టెలీకమ్యునికేషన్స్ విభాగం కూడా స్పష్టంగా చెబుతోంది.