ట్రంప్ శాసనం.. ఉక్రెయిన్ కు అమెరికా సాయం.. ఉన్నట్టా? లేనట్టా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్కటే ఒక్క సంతకం.. ఎన్నో జీవితాలను తలకిందులు చేస్తోంది.

Update: 2025-01-26 15:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్కటే ఒక్క సంతకం.. ఎన్నో జీవితాలను తలకిందులు చేస్తోంది.

వలసదారులను వెళ్లగొడుతోంది.. సరిహద్దుల్లో గోడ కడుతోంది.. ఇతర దేశాలను భయపెడుతోంది.. యుద్ధాన్ని కూడా ఆపుతోంది.

ఇప్పటికే 15 నెలల పాటు సాగిన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయింది. ఇక మిగిలింది మూడేళ్లుగా సాగుతున్న ఉక్రోయిన్-హమాస్ యుద్ధం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతటి మోనార్కో అందరికీ తెలిసిందే. ఆయనకు చెప్పగలిగేవారు ఈ భూమ్మీద మొన్నటివరకు భారత ప్రధాని మోదీ మాత్రమే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తోడయ్యారు.

అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక సంతకాలు చేసిన వందలాది కార్యనిర్వాహక ఆర్డర్ల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)లో ఒక్కటి మాత్రం ఉక్రెయిన్ ను చాలా కలవరపెడుతోంది. అదేమంటే.. యుద్ధ సాయం నిలిపివేత.

ట్రంప్ విడుదల చేసిన ఆర్డర్లలో విదేశాలకు అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపివేయడం ఒకటి. రష్యాతో శక్తికి మించి పోరాడుతున్న ఉక్రెయిన్ కు సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికానే అందిస్తోంది. 725 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్‌ డాలర్ల సామగ్రి సాయానికి బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్‌ కు హామీ ఇచ్చారు. ఇందులో 62 బిలియన్‌ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. మరో 500 మిలియన్‌ డాలర్ల ఆయుధ సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు.

కాగా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్‌ పలుసార్లు చెబుతూ వచ్చారు. యుద్ధం అనేది అసలు మొదలే కాకూడదని.. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌ సంక్షోభం వచ్చేది కాదన్నారు. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందంపై చర్చలకు రాకుంటే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

తాగాజా అమెరికా తమకు సైనిక సాయం ఆపలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కష్ట సమయంలో తమకు సాయం ఆపకుండా నిర్ణయం తీసుకున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైంది. అంటే సరిగ్గా ఈ ఫిబ్రవరి 24కు మూడేళ్లవుతుంది. అప్పటికి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయి నెల పూర్తవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం..?

Tags:    

Similar News