యూనివర్శిటీలకు ట్రంప్ టెన్షన్... క్యాంపస్ నుంచి సీరియస్ రిక్వస్ట్!

ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు.. వింటర్ విరామం నుంచి ముందుగానే క్యాంపస్ కు తిరిగి రావాలని రిక్వస్టులు కాస్త సీరియస్ గానే చేస్తున్నట్లు చెబుతున్నారు.

Update: 2024-12-27 07:11 GMT

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది జనవరి 20న ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సమయంలో అమెరికాలోని యూనివర్శిటీలు, కళాశాలలకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు.. వింటర్ విరామం నుంచి ముందుగానే క్యాంపస్ కు తిరిగి రావాలని రిక్వస్టులు కాస్త సీరియస్ గానే చేస్తున్నట్లు చెబుతున్నారు.

అవును... అమెరికాలోని యూనివర్శిటీలు, కాలేజీలకు ట్రంప్ టెన్షన్ మొదలైందని అంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ట్రంప్ సరికొత్త నిబంధనలు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... వింటర్ విరామానికి ముందే క్యాంపస్ లకు తిరిగిరావాలని మెయిల్స్ పెడుతున్నాయని అంటున్నారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

2023-24 అకడమిక్ ఇయర్ లో యూఎస్ కాలేజీలు, యూనివర్శిటీ సుమారు 1.1 మిలియన్లకు పైగా ఇంటర్నేషనల్ విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే... ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్న తర్వాత.. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు అమలు తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ముస్లిం దేశాల ప్రజల వీసాలు రద్దు అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో... ట్రంప్ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేసిన అనంతరం... ఆయన పరిపాలనలో లక్ష్యంగా చెబుతున్న కిర్గిస్థాన్, నైజీరియా, మయన్మార్, సూడాన్, టాంజానియా, లిబియా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా,యెమెన్, వెనిజులా, సోమాలియా దేశాలకు చెందిన పౌరులు ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. ఈ జాబితాలో చైనా, భారత్ లు చేరే అవకాశం ఉన్నాయనే చర్చ మొదలైందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... గత విద్యా సంవత్సరంలో 17,000 కంటే ఎక్కువ మంది ఇంటర్నేషనల్ విద్యార్థులను కలిగి ఉన్న సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ.. ఇప్పటికే విదేశీ విద్యార్థులకు ఈ మెరకు మెయిల్స్ పంపినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రావడానికి కనీసం వారం ముందు యూఎస్ కి తిరిగిరావాలని కోరిందని అంటున్నారు.

ఇదే సమయంలో... అంతర్జాతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సిబ్బంది అంతా కొత్త పరిపాలన ప్రారంభానికి ముందే క్యాంపస్ కు తిరిగి రావాలని.. సోషల్ మీడియా పుకార్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ కు సంబంధించిన గ్లోబల్ అఫైర్స్ కార్యాలయం కోరింది.

ఈ నేపథ్యంలో స్పందించిన యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆసక్తికర సూచన చేసింది. ఇందులో భాగంగా... అంతర్జాతీయ విద్యార్థుల ఇమ్మిగ్రేషన్స్ కు సంబంధించి ఆదేశాలు జారీ చేయబడతాయని ఖచ్చితంగా తెలియనప్పటికీ... జనవరి 13 - 2025న స్ప్రింగ్ సెమిస్టర్ ప్రారంభానికి ముందే యూఎస్ చేరుకోవడం బెటర్ అని తెలిపిందని అంటున్నారు.

Tags:    

Similar News