యూఎస్ ఎలక్షన్స్ లో ఈ నాలుగు స్టేట్స్ ఎంత కీలకమంటే..?

ఈ సమయంలో ఈ ఇద్దరు నేతలకూ నాలుగు రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఉన్నాయని అంటున్నారు.

Update: 2024-09-27 06:30 GMT

అమెరికాలో తాజా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ట్రంప్ వర్సెస్ బైడెన్ గా ఉన్నప్పుడు కాస్త వార్ వన్ సైడ్ గా ఉన్నట్లు అనిపించినా... కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య వార్ మాత్రం రసవత్తరంగా నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఇద్దరు నేతలకూ నాలుగు రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఉన్నాయని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమల మధ్య రసవత్తరంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న వేళ ఈ దఫా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ప్రధానంగా నాలుగు రాష్ట్రాలని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో మొదటిది పెన్సిల్వేనియా కాగా.. తర్వాత స్థానాల్లో వరుసగా విస్కాన్సిన్, ఉత్తర కరోలీనా, జార్జియా ఉన్నాయి.

పెన్సిల్వేనియా:

తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు. 19 ఎలక్టోరల్ ఓట్లతో ఉన్న ఈ అతిపెద్ద స్వింగ్ స్టేట్ మాత్రమే ప్రతీ అభ్యర్థి విజయానికీ అత్యంత సరళమైన మార్గానికి కీలకమైనదని అంటున్నారు. ఇదే సమయంలొ టీవీ, రేడియో ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే కావడం గమనార్హం.

అటు ట్రంప్, ఇటు కమలా హారీస్ లు ఇద్దరూ ఎక్కువ సమయం గడిపిన యుద్ధభూమిగా పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని అభివర్ణిస్తున్నారు. జూలై 21న కమలా హారీస్ అధ్యక్ష రేసులోకి ప్రవేశించినప్పటినుంచీ.. ఆమె తొమ్మిది వేర్వేరు రోజులలో రాష్ట్రంలో పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించారు. ఇదే క్రమంలో ట్రంప్ కూడా ఎనిమిది రోజులు ఇలా చేశారు.

2016లో డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాను, ప్రెసిడెన్సీని గెలుచుకోగా.. 2020లో బిడెన్ కూడా అదే చేశారు.

విస్కాన్సిన్:

జరుగుతున్న విశ్లేషణల ప్రకారం పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ లలో కమలా హారిస్ కు రెండు శాతం పాయింట్ల ఆధిక్యత ఉంది. ఆమె డెమోక్రాటిక్ అభ్యర్థి అయినప్పటి నుంచీ మూడు సార్లు ఈ రాష్ట్రంలో ప్రచారం చేసిన హారీస్ కి ఇక్కడున్న 10 ఎలక్టోరల్ ఓట్లు కీలకం. ఇక పెన్సిల్వేనియాను కోల్పోతే దానికి బర్తీ చేయడంలో ట్రంప్ కు ఇది చాలా ముఖ్యం.

ఉత్తర కరోలినా:

వాస్తవానికి ట్రంప్ విజయపథం పెన్సిల్వేనియా, నార్త్ కరోలియా, జార్జియా మీదుగా సాగుందని ఆయన సలహాదారులు భావిస్తున్నారు. 2008లో బరక్ ఒబామా గెలిచినప్పటి నుంచీ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఈ నార్త్ కర్లోలినాను గెలవలేదు. అయితే... ట్రంప్ ఆధిక్యం ఇక్కడ ఒక శాతం కంటే తక్కువగానే ఉంది.

పెన్సిల్వేనియాతో పాటు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా హారిస్ రేసులో ప్రవేశించినప్పటికీ.. ట్రంప్ కనీసం ఆరు రోజులు ఇక్కడ ప్రచారం చేశారు. 16 ఎలక్టోరల్ ఓట్లతో ఉత్తర కరోలినా అనేది పెన్సిల్వేనియాలో నష్టాన్ని పూడ్చడంలో కమలా హారిస్ కు సహాయపడుతుందని అంటున్నారు.

జార్జియా:

ట్రంప్ కు జారియా చాలా ముఖ్యం. ఇక్క్డ ఆయన తప్పకుండా గెలవాలని అంటున్నారు. 2020లో బిడెన్ కు ఇది తృటిలో వెళ్లిన రాష్ట్రం. ఇక హారీస్ ప్రచారం అట్లాంటా, దాని చుట్టుపక్కల ఉన్న ఆమె మద్దతుదారుల నుంచి అలాగే రాష్ట్రంలోని మరిన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆమెకు రాష్ట్రాన్ని అప్పగించగలది భావిస్తున్నారు.

తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచీ ఆమె ఇక్కడ నాలుగు రోజులు ప్రచారంలొ పాల్గొనగా.. ట్రంప్ రెండు సార్లు మాత్రమే అక్కడ ఉన్నారు.

Tags:    

Similar News