నష్టపోతున్నా.. తుపాకీ వీడని అమెరికా.. రీజనేంటి?
+ అది 2021, సెప్టెంబరు, న్యూజెర్సీలోని ఓ పాఠశాల. పిల్లలు బుద్ధిగా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు వింటున్నారు
+ అది 2021, సెప్టెంబరు, న్యూజెర్సీలోని ఓ పాఠశాల. పిల్లలు బుద్ధిగా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు వింటున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి దూసుకువచ్చారో.. తెలియదు కానీ, నలుగురు ఆగంతకులు ముఖాలకు ముసుగు వేసుకుని.. పాఠశాలలోకి ప్రవేశించారు. వచ్చీ రావడంతోనే అమాయక చిన్నారులపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 33 మంది చిన్నారులు రక్తపు మడుగులో కొట్టుకుని ప్రాణాలు కోల్పోయారు. అడ్డుకోబోయిన ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు అర్పించాడు.
+ అది 2021, డిసెంబరు. పెన్సిల్వేనియాలోని మరో పాఠశాల. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి తన స్కూల్ బ్యాగ్‌లో తెచ్చుకున్న తుపాకీతో తన తోటి విద్యార్థులపై జరిపిన అనూహ్య కాల్పలతో చెలరేగిపోయాడు. ఫలితంగా నలుగురు పిల్లలు అశువులు బాశారు. తుపాకీ వెంట తెచ్చుకున్న చిన్నారిని పోలీసులు అరెస్టు చేసి.. జువెనల్ హోంకు తరలించారు.కానీ, చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పటి వరకు(2024) న్యాయం జరగలేదు.
+ అది 2022, ఓ బ్యాంకులో దుండగుడు ప్రవేశించి జరిపిన కాల్పల్లో తెలంగాణకు చెందిన దంపతులు మృతి చెందారు. అదేసంవత్సవరం.. చైనాకు చెందిన జంటపై జరిగిన కాల్పుల్లో ఆ జంట మృతి చెందింది. ఇలా.. అమెరికాలో తుపాకీ సంస్కృతికి బలైపోయిన ప్రాణాలు ఎన్నో.. ఉన్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడిపై ఓ గ్రోసరీ స్టోర్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందాడు.
కట్ చేస్తే..
అమెరిలో విజృంభించిన తుపాకీ సంస్కృతి.. ఒక వైపు అమాయక పౌరుల ప్రాణాలు హరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. మరోవైపు.. ప్రాణాలు పోవడమేకాదు.. అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా ఈ తుపాకీ సంస్కృతి చిన్నాభిన్నం చేస్తోంది. ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2021-23 మధ్య అంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులను(సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు) అమెరికా కోల్పోయింది. దీనికి కూడా తుపాకీ కల్చరే కారణం. అయినప్పటికీ.. అగ్రరాజ్యంలో ఉన్న రాజకీయ కారణాలు.. చట్ట సభల సభ్యుల మధ్య అనైక్యత కారణంగా.. తుపాకీ సంస్కృతి.. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా వర్ధిల్లుతోంది. మరి ఇప్పటికైనా.. ఈ సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందా? లేదా? అనేది చూడాలి.