ఉత్తరాంధ్ర కు దానా గండం

ఏపీని వరస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు స్టార్ట్ అవుతూనే తుఫాన్లను మోసుకుని వస్తున్నాయి.

Update: 2024-10-21 02:50 GMT

ఏపీని వరస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు స్టార్ట్ అవుతూనే తుఫాన్లను మోసుకుని వస్తున్నాయి. మొదటి తుఫాను అయితే ఇప్పటికే దక్షిణాంధ్రాను అల్లల్లాడించింది. ఇపుడు ఉత్తరాంధ్ర కు పెను గండంగా మరో తుఫాను రానుంది అన్నది వాతావరణ నిపుణుల హెచ్చరికగా ఉంది,.

ఎగువ వాయు ఉపరితల ఆవర్తనము మధ్య అండమాన్ సముద్రం మీద కొనసాగుతూ వస్తోంది. అది మరింత బలపడుతోంది. దాని ప్రభావం వలన గల ఇరవై నాలుగుగంటల్లో తూర్పు మధ్య బంగాళా ఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇక చూస్తే కనుక ఈ నెల 22 ఉదయం నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అలా ఈ నెల 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారుతుంది అని అంటున్నారు.

ఇక ఈ నెల 24న ఉదయం నాటికి వాయువ్య బంగాళాఖాతం అంటే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దంతో ఈ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర కు చెందిన వివిధ జిల్లాల కలెక్టర్లు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు 23 నుండి 26 వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో తుఫాను మూలంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీ భారీ తుఫాన్ కి దానా తుపాను అని పేరు పెట్టడం జరిగింది.

మరి ఈ తుఫాను వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని ప్రజలు హడలిపోతున్నారు. ఆగస్ట్ నెల చివరిలో సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాంధ్రా కూడా ఇబ్బందులలో పడింది. నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఇటీవల దక్షినాంధ్రాకు వచ్చిన తుఫాను వల్ల కూడా ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు కురిసాయి. ఇపుడు ఉత్తరాంధ్రకే పెను గండం అని దూసుకుని వస్తున్న దానా తుఫానుతో ఏమి జరుగుతుందో అని అంతా వణుకుతున్నారు

ఉత్తరాంధ్రాకు ఎపుడూ తుఫానులు వస్తూనే ఉంటాయి. అటు ఒడిశా పశ్చిమ బెంగాళ్ అండమాన్ నికోబర్ దీవుల నుంచి తరచూ వచ్చే తుఫానుల ప్రభావంతో ఉత్తరాంధ్రా అతలాకుతలం అవుతూనే ఉంటుంది. ఉత్తరాంధ్రాని కేంద్ర బిందువుగా చేసుకుని తుఫాన్లు వస్తూంటాయి. రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్లు వచ్చినా తమిళనాడు దాకా వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చూపించినా ఉత్తరాంధ్రా భారీ వర్షాలతో తడుస్తూనే ఉంటుంది. ఇపుడు వచ్చే దానా తుఫాను ఏ విధంగా తన ప్రభావం చూపిస్తుందో అని అంతా ఆలోచిస్తున్నారు. పెద్దగా నష్టం చేయకుండా ఈ తుఫాను వెళ్ళిపోతే బాగుణ్ణు అని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.

Tags:    

Similar News