ప్రేమోత్సవం..యాపారం అదిరిపోయిందిగా

ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రదర్శించే ఆసక్తి అంతా ఇంతా కాదు.

Update: 2025-02-16 05:34 GMT

ఫిబ్రవరి పద్నాలుగు వచ్చేసిందంటే చాలు.. ఒకలాంటి ఎమోషన్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రదర్శించే ఆసక్తి అంతా ఇంతా కాదు. అంతేకాదు.. మనసుకు నచ్చిన వారికి ప్రత్యేకంగా గిఫ్టులు ఇచ్చుకోవటం.. వెకేషన్ కు వెళ్లటం మొదలు.. ప్రత్యేక లంచ్.. డిన్నర్లు ఏర్పాటు చేసుకోవటం.. మొత్తంగా ఒక పండుగ లాంటి వాతావరణం కనిపిస్తుంది.

మరింత గ్రాండ్ గా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్న తర్వాత వివిధ రంగాలకు చెందిన వ్యాపారాలు మా గొప్ప జోరుగా సాగటం తెలిసిందే. అదెంత అన్న విషయాన్ని గణాంకాల్లో చెబితే.. ఆశ్చర్యపోతారు. ప్రేమికుల దినోత్సవం వెనుక ఇంత భారీ వ్యాపారం ఉందా?అన్నది విస్మయానికి గురి చేస్తుంది. వివిధ సంస్థలు విడుదల చేసిన నివేదికల్ని చూసినప్పుడు ప్రేమికుల దినోత్సవం ఏమో కానీ వ్యాపారులకు మాత్రం అదో భారీ పండుగగా మారుతుందని చెప్పక తప్పదు.

ప్రేమికుల దినోత్సవ వేళ పలు కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి.. తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆన్ లైన్ సంస్థలు సైతం ఆఫర్లతో పోటీలోకి వచ్చాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొన్ని ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ తో పాటు ఐజీపీ.. ఫ్లవర్ ఆరా ఫ్లడ్ వంటి గిఫ్టింగ్ ప్లాట్ ఫామ్స్ పర్సనలైజ్డ్ మగ్స్.. హార్ట్ షేప్ కుషన్లు.. ఇతర కానుకల్ని పరిచయం చేయటం గమనార్హం.

ప్రేమికుల దినోత్సవ వేళ.. పలు సంస్థల వ్యాపారం ఏ రేంజ్ లో సాగిందన్న దానికి నిదర్శనంగా కొన్ని గణాంకాల్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి 24 ఆర్డర్ల ద్వారా 174 చాక్లెట్లను రూ.29,844కు కొనుగోలు చేసినట్లుగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ప్రకటించింది. ఫిబ్రవరి 14న పీక్ టైమ్ లో నిమిషానికి 581 చాక్లెట్లు.. 324 గులాబీలకు ఆర్డర్ వచ్చినట్లుగా స్విగ్గీ పేర్కొంది. ప్రేమికుల రోజున 4 లక్షల గులాబీలకు ఆర్డర్లు పొందినట్లుగా ఎఫ్ఎన్ బీ తెలిపింది. ఫిబ్రవరి నెల మొదటి నుంచి 13వ తేదీ వరకు 15 లక్షల గులాబీలు అమ్మితే.. ఒక్క ప్రేమికుల దినోత్సవం రోజున మాత్రం 4 లక్షల గులాబీలు అమ్మటం గమనార్హం. ఇలా ఈసారి ప్రేమికుల దినోత్సవం పలు సంస్థలకు భారీ వ్యాపారాన్ని కల్పించిందని చెప్పాలి.

Tags:    

Similar News