మాజీ ప్రియుడిపై ఈమె ప్రతీకారం పిక్స్... వీడియో వైరల్!

వాలంటైన్స్ డే అంటే అందమైన ప్రేమ బహుమతులు ఇచ్చికోవడమే కాదు.. రివేంజ్ లు కూడా తీర్చుకోవచ్చని ఓ అమ్మాయి వెరైటీగా భావించింది.

Update: 2025-02-15 10:49 GMT

వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది గ్రాండ్ గా జరుపుకున్నారని అంటున్నారు. మరికొంతమంది ఒంటరిగానే కాలం వెళ్లదీసినట్లు చెబుతున్నారు. ఇంకొంతమంది జంటయ్యే ప్రయత్నాలు చేసి పాస్ అయ్యి కొంతమంది, ఫెయిల్ అయ్యి కొంతమంది, రిజల్ట్ ఏమైందో తెలియక మరికొంతమంది ఉన్నారని అంటున్నారు.

ఇక ఈ వాలంటైన్స్ డే రోజు రకరకాల బహుమతులు ఇచ్చి వారి వారి భాగస్వాములను సర్ ప్రైజ్ చేసిన వాళ్లు కొంతమందైతే.. ముందే చెప్పి మరీ థ్రిల్ చేసిన వారు ఇంకొంతమంది అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఓ అమ్మాయి మాత్రం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఊహించని రీతిలో రివేంజ్ తో కూడిన సర్ ప్రైజ్ ఇచ్చింది.

అవును... వాలంటైన్స్ డే అంటే అందమైన ప్రేమ బహుమతులు ఇచ్చికోవడమే కాదు.. రివేంజ్ లు కూడా తీర్చుకోవచ్చని ఓ అమ్మాయి వెరైటీగా భావించింది. ఇందులో భాగంగా... ఉన్నంతలో రొటీన్ కి భిన్నంగా ఆలోచించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన ఆయుషీ రావత్ అనే అమ్మాయి.. తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా భావించింది. అందుకు ప్రేమికుల రోజును ముహూర్తంగా ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు ఆన్ లైన్ లో 100 పిజ్జాలు ఆర్డర్ పెట్టి.. డెలివరీ అడ్రస్ ప్రియుడి ఇల్లు పెట్టింది. ఇక.. పేమెంట్ ఆప్షన్.. క్యాష్ ఆన్ డెలివరీ అని క్లిక్ చేసింది.

మ్యాజిక్ పిన్ అనే యాప్ నుంచి ఈ ఆర్డర్ పెట్టగా.. ఆయుషీ ఆర్డర్ మేరకు ఆమె మాజీ ప్రియుడి ఇంటికి డెలివరీ బాయ్ ఆ 100 పిజ్జా బాక్సులను తీసుకొచ్చాడు. వరుసగా ఒకదానిపై ఒకటి ప్రియుడి ఇంటి ముందు పేర్చి.. డోర్ బెల్ కొట్టాడు. దీంతో.. ఆయుషీ మాజీ ప్రియుడి ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ కి గురైనట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోండగా.. కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా... బలే రివేంజ్ తీర్చుకుంది అని ఒకరంటే.. ఇంతకాలం ఇతడితో కలిసి ఈ పిజ్జాలే తిన్నట్లుంది అని ఇంకొకరు స్పందించారు. ఇదే సమయంలో.. తాము కూడా ఈ రివేంజ్ ని ప్లాన్ చేస్తామని మరికొంతమంది స్పందిస్తున్నారు!

Tags:    

Similar News