త్వరలోనే విడుదల.. ఇలా గోడమీద రాసుకుంటే సరిపోతుందేమో..!

ఓ స్త్రీ రేపు రా.., అరువు రేపు.. నగదు నేడు.. ఇలాంటి పదాలు గతంలో ప్రతిచోటా కనిపించేవి.. ముఖ్యంగా వ్యాపార సంస్థల వద్ద అరువు వ్యాపారం లేకుండా చూసుకునేందుకు ‘అరువు రేపు’ అని రాసేవారు.;

Update: 2025-04-08 05:31 GMT
త్వరలోనే విడుదల.. ఇలా గోడమీద రాసుకుంటే సరిపోతుందేమో..!

ఓ స్త్రీ రేపు రా.., అరువు రేపు.. నగదు నేడు.. ఇలాంటి పదాలు గతంలో ప్రతిచోటా కనిపించేవి.. ముఖ్యంగా వ్యాపార సంస్థల వద్ద అరువు వ్యాపారం లేకుండా చూసుకునేందుకు ‘అరువు రేపు’ అని రాసేవారు. అంటే ఎప్పుడు వెళ్లినా ఆ గోడపై రేపు అని రాసుంటుందని, తమ వ్యాపారం శాశ్వతంగా నగదు రూపంలో జరుగుతుందని వ్యాపారులు భావించేవారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతులు ఎలా ఉన్నాయో గానీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం ‘త్వరలో విడుదల’ అని గోడపై రాసుకోవాలని టీడీపీ సెటైర్లు వేస్తోంది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న వల్లభనేనికి రెండు కేసుల్లో బెయిల్ వచ్చినా, మరో రెండు కేసులు పెండింగులో ఉండటంతో ఆయన విడుదల ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. దీంతో టీడీపీ సోషల్ మీడియా వల్లభనేనిపై సెటైర్లు పేల్చుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో వైరం పెట్టుకుని, కూటమి ప్రభుత్వానికి టార్గెటుగా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాపు కేసులో అరెస్టు అయిన వంశీని ఆ తర్వాత పీటీ వారంటుపై అదుపులోకి తీసుకుని వివిధ కేసుల్లో అరెస్టు చూపారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో వంశీని జైలులో పెట్టడమనే వ్యూహాన్ని అమలు చేశారంటున్నారు. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఆ వ్యూహం ఫలించిందనే చర్చకు తావిస్తోంది. కిడ్నాపు కేసు తర్వాత వంశీపై వరుస కేసులు నమోదు చేయడంతో వంశీ రెండు నెలలుగా జైలులోనే గడుపుతున్నారు.

అయితే వంశీపై నమోదైన కేసుల్లో కొన్నింటికి బెయిల్ వస్తున్నా, కిడ్నాపు కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడం లేదు. దీంతో వంశీ జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. తాజాగా భూ కబ్జా కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా జైలులోనే ఉండిపోవాల్సి రావడంతో వంశీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిని ఊహించిన టీడీపీ సోషల్ మీడియా వంశీపై సెటైర్లు పేల్చుతోంది. వంశీని ఇప్పట్లో వదిలకూడదంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అయితే న్యాయ ప్రక్రియ ద్వారా బయటపడేందుకు వంశీ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో ఆయన అభిమానులుతోపాటు కుటంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీకి క్షమాభిక్ష పెట్టాలంటూ న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News