వల్లభనేని వంశీకి మరింత కాలం జైలు తప్పదా?

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీ మరింత కాలం జైల్లోనే ఉండాల్సి రానుందా? ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే వీల్లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.;

Update: 2025-04-16 05:12 GMT
వల్లభనేని వంశీకి మరింత కాలం జైలు తప్పదా?

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీ మరింత కాలం జైల్లోనే ఉండాల్సి రానుందా? ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే వీల్లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్నిచూస్తే.. ఇలాంటి పరిస్థితి తప్పదన్నట్లుగా కనిపిస్తోంది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు మరో నెల గడువు ఇవ్వాలని కోరుతూ అధికారులు కోర్టును కోరారు. దీనికి సంబంధించి మెమో దాఖలు చేశారు.

కేసులో తదుపరి దర్యాప్తు కంటిన్యూ చేసేందుకు విచారణ అధికారి.. సెంట్రల్ ఏసీపీలు ఈ మేరకు జడ్జిని తమకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా.. మరో ఆరుగురిని అరెస్టు చేయాల్సి ఉందని.. పరారీలో ఉన్న వీరిని పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. నేరానికి ఉపయోగించిన కారును ఇంకా సీజ్ చేయాల్సి ఉందన్నారు.

ఈ కేసుకు సంబంధించి మరికొందరు సాక్ష్యుల్ని విచారించాల్సి ఉందని.. సాక్ష్యాల్ని సేకరించాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో దర్యాఫ్తును పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కావాలని కోరారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ రెండోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.

ఆయనకు బెయిల్ ఇచ్చే అంశాన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ రావటానికి మరింత కాలం పడుతుందని చెబుతున్నారు. తాజా పరిణామం వంశీ బెయిల్ లభించే విషయంలో మరింత ఆలస్యానికి కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News