ఫస్ట్ లుక్: వందేభారత్ స్లీపర్ వెర్షన్... భారతీయ రైల్వేలో విప్లవం!

ఈ సమయంలో వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Update: 2024-10-27 03:59 GMT

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థగా ఉన్న రైల్వేలో అరికొత్త విప్లవం తెరపైకి వస్తోంది! ఇప్పటికే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్రం.. తాజాగా వందేభారత్ రైళ్లలో స్లీపర్ వెర్షన్ కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సమయంలో వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అవును... చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందేభారత్ రైలు స్లీపర్ వెర్షన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని పిక్స్ విడుదలయ్యాయి. ఇందులో... ట్రైన్ ఇంటీరియస్, లగ్జరీ డిజైన్, అధునాత ఫీచర్లతో వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి!

రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించబడిన వందే భారత్ స్లీపర్ 800 నుంచి 1,200 కి.మీ. మధ్య దూరాలను కవర్ చేసే మార్గాలలో నడపబడుతుంది. ప్రధానంగా... రైలు ప్రయాణికుల కంఫర్ట్ ని సెక్యూరిటీని మరింత మెరుగుపరచడానికి అనేక లక్షణాలను ఇది కలిగి ఉంది. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడి ఉంది.

ఇక, ఈ వందేభారత్ స్లీపర్ రైలులో సుమారు 820 మంది ప్రయాణించేలా 16 కోచ్ లను కలిగి ఉంటుంది. ఈ రైలు గరిష్టవేగం గంటకు 160 కి.మీ.గా చెబుతున్నారు. ఈ విషయాలపై స్పందించిన ఐసీఎఫ్ జనరల్ మేనేజర్... వందే భారత్ స్లీపర్ వెర్షన్ లో సంప్రదాయ రైళ్లకు భిన్నంగా ఉంచే అత్యాధునిక సౌకర్యాలను హైలైట్ చేశారు.

ఇదే సమయంలో... భద్రత విషయానికొస్తే... ఈ రైలులో ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టం తో పాటు ఇతర అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ప్రమాదాల సమయంలో కోచ్ లు ఒకదనికొకటి పైకి లేవకుండా.. రైలులో యాంటీ కోలిజన్ సిస్టం, యాంటీ-క్లైంబింగ్ టెక్నాలజీ ఉన్నాయి!

ప్రధానమైన ప్రత్యేకతలు:

సెన్సార్ యాక్టివేటెడ్ డోర్స్.. టచ్ ఫ్రీ బయో వాక్యూం టాయిలెట్స్.. ఇంటర్ కనెక్టింగ్ డోర్స్.. టాక్ బ్యాక్ యూనిట్స్.. ఫ్లైట్ స్టైల్ అటెండేంట్ బటన్స్ ఉన్నాయి!

ఇక.. అధికారికంగా ప్రారంభించే మూందు ఈ ట్రైన్ పలు పరీక్షలు ఎదుర్కోనుంది. ఇందులో భాగంగా... రాబోయే రెండు నెలల్లో ఇది గంటకు 90 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష లక్నో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్.డీ.ఎస్.ఓ), పశ్చిమ రైల్వే సౌకర్యాలలో జరుగుతుంది. నవంబర్ 15కి పూర్తి వివరాలూ వెల్లడవుతాయి!

Tags:    

Similar News