ఏలూరు వాసులకు గుడ్ న్యూస్!

ఏలూరు వాసులకు ఒక గుడ్ న్యూస్. ఆ మాటకు వస్తే.. ఏలూరుకు వెళ్లే వారందరికి ఆనందానికి గురి చేసే అంశంగా చెప్పాలి.

Update: 2024-08-23 04:31 GMT

ఏలూరు వాసులకు ఒక గుడ్ న్యూస్. ఆ మాటకు వస్తే.. ఏలూరుకు వెళ్లే వారందరికి ఆనందానికి గురి చేసే అంశంగా చెప్పాలి. విశాఖఫట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ కు మరో కొత్త స్టాప్ ను ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఆదివారం (ఆగస్టు 25) నుంచి అమల్లోకి రానుంది.

సికింద్రాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరే వందే భారత్ ట్రైన్ విజయవాడ మీదుగా విశాఖకు చేరుకోవటం.. కాసేపటికే మళ్లీ బయలుదేరి.. విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు చేరుకోవటం తెలిసిందే. ఈ ట్రైన్ కు ఇప్పటివరకున్న పరిమిత స్టాపుల్లో మరో కొత్త స్టాప్ ను చేర్చారు. విజయవాడ నుంచి వెళ్లే వందే భారత్ (20707) ట్రైన్ కు రాజమహేంద్రవరం వరకు మరే స్టాప్ లేదు. ఇప్పుడు ఏలూరులో వందే భారత్ ను ఆపనున్నారు.

అదే విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ (20708) ట్రైన్ కు రాజమహేంద్రవరం తర్వాత విజయవాడ స్టేషన్ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్ గా పరుగులు తీస్తూ ఉంటుంది. దీంతో.. పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో.. పలువురు వందేభారత్ ను తమ స్టేషన్ లో ఆపాలని కోరారు.

వీరి విన్నపాన్ని దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ట్రైన్ ఏలూరుకు ఉదయం 9.49 గంటలకు చేరుకొని.. నిమిషం స్టేషన్ లో ఆగి ఉదయం 9.50లకు బయలుదేరుతుంది. అదే విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఏలూరుకు సాయంత్రం 5.54 గంటలకు చేరుకొని.. 5.55 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరుంది. విశాఖ నుంచి ఏలూరుకు వెళ్లే వారు.. ఏలూరు నుంచి విజయవాడ.. సికింద్రాబాద్ వెళ్లాలనుకునే వారికి.. అదే విధంగా సికింద్రాబాద్ మొదలు విజయవాడ వరకు ఏలూరుకు వెళ్లాల్సిన ప్రరయాణికులకు ఈ ట్రైన్ విపరీతమైన సౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News