వందేభారత్ లో వంగలపూడి అనిత... హోంమంత్రిగా బాధ్యతల స్వీకరణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికోసం ఆమె మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా రైలులో ఆమెతో పలువురు ప్రయాణికులు సెల్ఫీలు తీసుకున్నారు.. అభినందనలు తెలిపారు.
అవును... ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. దీని కోసం అనిత.. విశాఖ నుంచి విజయవాడకు వందేభారత్ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రైలు ప్రయాణికులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనంతరం ఆ సమస్యలను తాను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హోమంత్రి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విజయవాడలో రైలు దిగి అక్కడ నుంచి కానూరులోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆమె విజయవాడలో రైలు దిగిన అనంతరం రైల్వే డీఎస్పీ నాగేశ్వర రావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా సచివాలయం బ్లాక్ 2 లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్:
మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా... విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నాగబాబు, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులూ పవన్ కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కు అభినందనలు తెలిపినవారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఉన్నారు.