వంగవీటిలో వైరాగ్యం నిజమేనా ?
ఇక రాధా కూడా నిలకడ లేని రాజకీయం చేశారు అన్న ముద్ర కూడా ఉంది అంటున్నారు. ఆయన అనేక పార్టీలు మారారు.;
తండ్రి వంగవీటి మోహన రంగా ఒక బలమైన సామాజిక వర్గానికి ఆరాధ్య నాయకుడు. అంతే కాదు బడుగు బలహీన వర్గాలకు ఆయన దేవుడు. ఒక్కసారే ఎమ్మెల్యే అయినా రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందారు. ఆయన ఆలోచనలు ఆశయాలు ఈ రోజుకూ తెలుగు నాట మారుమోగుతుంటాయి. వంగవీటి రంగా అంటేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.
అలాంటి రంగా వారసుడు ఎంతగా కనిపించాలి. ఆయన ఎంతగా రాణించాలి. కానీ అదేంటో కానీ వంగవీటి రాధాక్రిష్ణకు రాజకీయంగా అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయని అంటున్నారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ తో 2004లో మొదలైంది. ఆనాడు విజయవాడ తూర్పు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009 నాటికి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఇక ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో ఆ పార్టీ టికెట్ దక్కలేదని టీడీపీ వైపు వచ్చారు. అయితే టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు. పైగా పార్టీ ఓటమి పాలు అయింది. గత అయిదేళ్ళుగా అలా విపక్షంలో ఆయన ఉన్నారు.
ఒక విధంగా చూస్తే వైసీపీ విపక్షంలో ఉన్నపుడు అందులోనూ ఉన్నారు. ఇలా రాజకీయంగా అవకాశాలను అందుకోలేక రాధాకృష్ణ ఇబ్బందులు పడుతున్నారు. 2024 ఎన్నికల్లో రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తారని అనుకున్నా అది సీనియర్ నేత బోండా ఉమాకు దక్కింది. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు.
తీరా చూస్తే ఇప్పటికి ఏపీ నుంచి ఏడు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే టీడీపీ అందులో నాలుగు తీసుకుంది కానీ రాధాకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తాజా ఎంపికలోనూ రాధాకు మొండి చేయి దక్కింది. దాంతో రాధా వర్గం పూర్తి నిరాశలో ఉంది.
చట్టసభలలో రాధా ప్రవేశించి రెండు దశాబ్దాలకు పై దాటుతోందని వారు అంటున్నారు. రంగా కుమారుడిగా అందరూ ఆయన గురించి చెబుతారు కానీ తీరా పదవులు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అవి దూరంగా అవుతున్నాయని అంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీ గ్యారంటీ అని మంత్రి పదవి కూడా ఖాయమని అంతా అనుకున్న నేపథ్యంలో రాధాకు ఈ విధంగా జరగడం పట్ల చర్చ సాగుతోంది.
మరో వైపు రాధా కూడా రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని అంటున్నారు. ఇంతకాలం చేసిన రాజకీయం ఇక చాలు అని రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడదామా అన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియదు కానీ రాధా వర్గం అప్ సెట్ అయింది అని అంటున్నారు.
ఇక రాధా కూడా నిలకడ లేని రాజకీయం చేశారు అన్న ముద్ర కూడా ఉంది అంటున్నారు. ఆయన అనేక పార్టీలు మారారు. కానీ ఆయా పార్టీల నుంచి ఆయనకు దక్కింది ఏమీ లేదు కానీ ఈ ముద్ర మాత్రం మిగిలింది అంటున్నారు. ఇంకో వైపు ఆ పార్టీలకు వంగవీటి బ్రాండ్ ని ఆయన అందించారు కానీ ఆయనకు ఒరిగింది లేదని అంటున్నారు.
ఈ క్రమంలో తాను రాజకీయంగా ఎందుకు కొనసాగాలి అని ఆయనను ఆలోచింపచేస్తోంది అని అంటున్నారు. ఆయన కనుక తీవ్ర నిర్ణయం తీసుకుంటే మాత్రం అది వంగవీటి అభిమానులతో పాటు ఒక బలమైన సామాజిక వర్గానికి ఇబ్బందికరమే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.