అగ్గి రేపిన వర్మ ట్వీట్...గాయబ్ అయిందా ?
మరి వర్మ పేరుతో వేసిన ఈ ట్వీట్ డిలిట్ చేసినా అందులోని అర్హ్దాలు పరమార్ధాలు కూటమి పెద్దలకు సరైన తీరులోనే చేరాయని అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు పిఠాపురం వర్మ గురువారం వేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి విధితమే. విజయం కష్టపడి గెలిస్తేనే అంటూ ఆయన వేసిన ట్వీట్ రచ్చ రచ్చ చేసింది. పైగా పవన్ విజయం కోసం తాను ఎంతో కష్టపడి ప్రచారం చేసినట్లుగా తనవే ఉన్న వీడియోలను వర్మ ట్విట్టర్ హ్యాండిల్ లో జత చేశారు.
అంతే ఒక్కసారిగా జనసేన నుంచి భారీ ఎత్తున ఎటాక్ మొదలైంది. పవన్ ని తక్కువ చూపించడం కోసమేనా ఇదంతా అంటూ సైనికులు హాట్ కామెంట్స్ చేశారు. దాంతో గురువారం కనిపించిన ట్వీట్ కాస్తా శుక్రవారానికి డిలిట్ అయిపోయింది. దాని వెనక చాలానే జరిగింది అని ప్రచారం సాగుతోంది. వర్మ ట్వీట్ తో కూటమిలో రాజుకున్న అగ్గిని చల్లార్చడానికి టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి ట్వీట్ ని డిలిట్ చేయమని ఆదేశించారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు చూస్తే వర్మ కూడా దానిని అంగీకరించారని అయితే ఆయన తాను ఈ ట్వీట్ వేయలేదని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తన సోషల్ మీడియాను హైదరాబాద్ కి చెందిన కంపెనీ మూడేళ్ళుగా చూస్తోందని వారే ఈ విధంగా చేశారని వర్మ చెప్పడమే కాదు సదరు కంపెనీ ప్రతినిధులను మందలించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.
ఇంకో వైపు చూస్తే సదరు కంపెనీ కూడా పొరపాటున ట్వీట్ వేశామని చెప్పారని అంటున్నారు ఏది ఏమైనా వర్మ పేరుతో వచ్చిన ఒక్క ట్వీట్ మాత్రం రచ్చ చేసింది అనే అంటున్నారు. ఇదిలా ఉంటే వర్మ చాలా కాలంగా సరైన పదవి కోసం ఎదురుచూస్తున్నారు.
ఆయన తన సీటుని త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నియోజకవర్గంలో మద్దతు ఇచ్చారు. తనకే తొలి ఎమ్మెల్సీ అని కూటమి పెద్దలు నాడు చేసిన ప్రామిస్ ఈ రోజుకీ నెరవేరక పోవడం పట్ల ఆయన అసహనంగా ఉన్నారని ప్రచారం సాగింది.
మరో వైపు చూస్తే ఈ ట్వీట్ వర్మ వేయకపోయినా ఆయన మనసెరిగి వేశారని అంటున్నారు. మరి వర్మ పేరుతో వేసిన ఈ ట్వీట్ డిలిట్ చేసినా అందులోని అర్హ్దాలు పరమార్ధాలు కూటమి పెద్దలకు సరైన తీరులోనే చేరాయని అంటున్నారు. దాంతో వారు కచ్చితంగా ఏదో ఒక కీలక పదవిని భవిష్యత్తులో వర్మకు ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి వర్మకు దక్కే పదవి ఏమిటో. ఇంకో వైపు చూస్తే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత నామినేటెడ్ పదవుల పందేరం ఉంటుందని చర్చ సాగుతోంది. దాంతో వర్మకు ఈసారి తప్పకుండా న్యాయం జరుగుతుందని అంటున్నారు.