' వెనిగండ్ల ', ' చింత‌మ‌నేని ' కి మంత్రి ప‌ద‌వులు... బాబుపై హై లాబీయింగ్‌..!

ఏపీలో కూటమి అప్రతీహత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూటమి నుంచి ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు

Update: 2024-06-11 09:30 GMT

ఏపీలో కూటమి అప్రతీహత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూటమి నుంచి ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు మంత్రివర్గం కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారు మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ మొదలుపెట్టేశారు. కొందరు కీలక నేతలు, ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ల కోసం రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున లాబీయింగ్‌ నడుస్తోంది. ఆ లిస్టులో గుడివాడలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై తిరుగులేని విజయం సాధించిన ఎన్నారై వెనిగండ్ల రాముతో పాటు, టీడీపీ పైర్‌ బ్రాండ్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు.

వీరిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని ఆయా జిల్లాల్లో ఉన్న టీడీపీ నాయకులు, అభిమానులు, నియోజకవర్గాలు.. ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయిలో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఇక గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు మాత్రమే కాదు.. రాజకీయాలతో సంబంధం లేని తెలుగు ప్రజలు కూడా కోరుకున్నారు. ఒకప్పుడు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా ఉండేది. అలాంటి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న నాని తెలుగుదేశంకు కొరకరానికి కొయ్యగా మారారు.

పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు.. లోకేష్‌తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను.. చివరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ వచ్చారు. ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఎలాగైనా గుడివాడలో కొడాలి నాని ఓడిపోవాలని కోట్లాదిమంది తెలుగుదేశం అభిమానులు కోరుకున్నారు. వారి కోరికను రాము నెరవేర్చారు. గ‌త డిసెంబ‌ర్‌లో గుడివాడ టిడిపి ఇన్చార్జిగా పగ్గాలు చేపట్టి కొడాలి నాని ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎంతో కష్టపడి నానిని చిత్తుగా ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. ఇంకా చెప్పాలంటే కొడాలి నానిని ఓడించ‌డమే క‌ష్టం అనుకున్న టైంలో.. గెల‌వ‌డం.. అది కూడా 53,000 భారీ మెజార్టీ అంటే మామూలు విషయం కాదు.

రాముకు మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభావం గుడివాడ నియోజకవర్గంలో పాటు.. ఉమ్మడి కృష్ణాజిల్లా అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉంటుందని.. పైగా కంచుకోట గుడివాడను మరింత స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు.. నానికి భవిష్యత్తులోనూ గుడివాడలో ఛాన్స్ లేకుండా చేసినట్టు అవుతుందని.. అందుకే రాముకు మంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర కీల‌క నేత‌లు, కొంద‌రు పారిశ్రామికవేత్తలు, వైసీపీ బాధితులు.. తెలుగుదేశం పార్టీని అభిమానించే సామాజిక వర్గ పెద్దలు బాబుపై గట్టిగా ఒత్తిళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక గోదావరి జిల్లాలలో పార్టీని బ్రతికించడంలో చింతమనేని ఎంతో కృషి చేశారు. ఆయనపై ఎన్ని కేసులు పెట్టిన, జైల్లో పెట్టినా చింతమనేని వాటిని తట్టుకుని మరి రాజ‌కీయంగా నిలిచి.. తాజా ఎన్నిక‌ల్లో ఘనవిజయం సాధించారు. పైగా ఈసారి గోదావరి జిల్లాలలో పొత్తుల నేపథ్యంలో కమ్మ సామాజిక వ‌ర్గం చాలా సీట్లు త్యాగం చేసింది. అందుకే ఈసారి చింతమనేనికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా చింతమనేని కోసం గోదావరి జిల్లాల నుంచి.. అటు రాము కోసం అమెరికా నుంచి అమరావతి వరకు చంద్రబాబుపై ఒక రేంజ్ లో ఒత్తిళ్లు ఉన్నాయి.

Tags:    

Similar News