ఆ ఐపీఎస్ ఓటు గయాబ్

వైసీపీతో ఆయనకు ఉన్న విభేధాల కారణంగానే ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ చోటు చేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-05-14 06:40 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో వారిద్దరూ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఆయనతో పాటు, ఆయన భార్య కవితల ఓట్లను తొలగించడమే దీనికి కారణం. ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నారు. నిన్న ఉదయం దంపతులు ఇద్దరూ ఓటు వేయడానికి లయోలా కాలేజ్ ప్రాంగణంలోని 59వ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

అయితే, ఓటర్ల జాబితా నుంచి ఇద్దరి ఓట్లను తొలగించినట్టుగా ఉందని అధికారులు తెలపడంతో వారిద్దరూ మౌనంగా వెనుదిరిగి వచ్చారు. వారి పేర్లు ఉన్న చోట 'డిలీటెడ్' అని ఉన్న పత్రాలను వారికి అధికారులు చూపించారు. ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగించడం గమనార్హం. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కూడా తన ఓటు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

ఈ ఎన్నికలలో వెంకటేశ్వర్ రావు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, పోలీసు అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని సోమవారం వైసీపీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. వైసీపీతో ఆయనకు ఉన్న విభేధాల కారణంగానే ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ చోటు చేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News