విడదల రజని...టీడీపీతో ప్యాచప్!

కానీ టీడీపీ మాత్రం ఇపుడు ఆమె విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది అంటే ఆమె పచ్చ పార్టీతో ప్యాచప్ చేసుకున్నారనే అంటున్నారు.

Update: 2024-09-14 15:30 GMT

వైసీపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన మహిళా నాయకురాలు విడదల రజని. ఆమె కేవలం రెండేళ్ళు మాత్రమే మంత్రి పదవిలో ఉన్నా ఆ అధికారం దర్జా దర్పాన్ని పూర్తిగా వాడేసుకున్నారు అని టాక్ కూడా ఉంది. ఆమె హవా ఎంతలా నడిచిందో గుంటూరు జిల్లాలో అంతా గట్టిగానే చెప్పుకుంటారు.

ఆమె సింగిల్ టైం ఎమ్మెల్యేగా ఉంటూనే మంత్రి పదవిని అందుకున్నారు అంటేనే గ్రేట్ అనుకోవాలి. ఆమె మొదట టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసారు. ఆ సమయంలో ఆమె చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగిడారు. అంతే కాదు విజనరీ అన్నారు. ఈ రోజుకీ ఆ వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయి.

కట్ చేస్తే ఆమె సడెన్ గా వైసీపీలోకి వచ్చింది. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు ఉండగా తనకు టికెట్ రాదు అని భావించే ఆమె వైసీపీ వైపు వచ్చారు తప్ప మరోటి కాదని కూడా అంటారు. అలా వచ్చిన ఆమెను పార్టీలో చేర్చుకుని ఎకాఎకీన ఎమ్మెల్యే టికెట్ ని జగన్ ఇచ్చేశారు. పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన మర్రి రాజశేఖర్ ని అలా పక్కన పెట్టేసారు.

మరో వైపు చూస్తే ఎంతో మంది సీనియర్లు ఉండగా ఆమెను విస్తరణలో మంత్రిగా చేసి వైసీపీ హై కమాండ్ ఆమెకు ఎనలేని విలువ గౌరవం ఇచ్చింది. ఇంత చేసినా ఆమె వల్ల గుంటూరు జిల్లాలో వైసీపీకి రాజకీయంగా కలసి వచ్చింది ఏమీ లేకపోగా ఇబ్బందులే వచ్చాయని అంటున్నారు.

ఆమె గుంటూరు జిల్లాలో నందిగం సురేష్ ని జగన్ పరామర్శించినపుడు మీడియాతో మాట్లాడుతున్నపుడు ఆయన పక్కన విడదల రజనీ కనిపించింది. దీనిని అందరూ టీవీలలో యూట్యూబ్ లో చూస్తూ మళ్లీ ఈవిడ వచ్చిందేంటి పెద్ద ఎత్తున చర్చించుకున్న నేపథ్యం ఉంది.

మరి ఆమె జగన్ పక్కన కనిపించడం మీద డిస్కషన్ ఒక రేంజీలో సాగింది అంటేనే వైసీపీ అధినాయకత్వం అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలో చేసిన ఆర్ధిక మోసాల మీద యూట్యూబ్ చానల్స్ లో పెద్ద ఎత్తున కధనాలు వండి వారుస్తున్నారు. అందుకే ఆమె గురించి అంతా అలా చర్చించుకున్నారు అని అంటున్నారు.

మరి ఆమె మంత్రిగా ఉన్నపుడు సొంత లాభం కోసం చేసిన ఘన కార్యాల వల్లనే పార్టీ ఇబ్బందులో పడింది అని అంటున్నారు. అటువంటి విడదల రజనీని పక్కన పెట్టుకుని రాజకీయం చేయలనుకుంటే గుంటూరు జిల్లాలో ఎవరూ కూడా వైసీపీకి పనిచేసేందుకు మిగలరు అని అంటున్నారు.

అంతే కాదు మేము పనిచేయమని కూడా వైసీపీ నేతలు చెప్పే సీన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆమెకు వైసీపీలో ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా వైసీపీకి గుంటూరు జిల్లాలో ట్రబుల్స్ తప్ప మరేమీ రిటర్న్ గిఫ్టులుగా రావు అని కూడా అంటున్నారు.

ఇక విడదల రజనీ ఎటూ టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి ఆ పార్టీతో కూడా ఆమెకు పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె టీడీపీలో ఒక పెద్ద మనిషి ద్వారా తన మీదకు ఏ కేసులూ రాకుండా చేసుకున్నారని ఆ విధంగా టీడీపీతో టై అప్ చేసుకున్నారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.

నిజానికి చూస్తే చిలకలూరి పేట టికెట్ ఇప్పిస్తాను మల్లెల రాజేష్ నాయుడు నుంచి ఆమె సొమ్ములు తీసుకున్నారని ఆ మధ్యన ప్రచారం సాగింది. అందులో కొంత మొత్తం వెనక్కి ఇవ్వాలని ఆయన పోలీసు కీసు పెడుతున్నరని కూడా అనుకున్నారు. అలాగే స్ట్రోన్ క్రషర్స్ యజమానుల మీద కూడా ఒత్తిడి పెట్టి ఆమె మంత్రిగా ఉండగా దందాలు చేశారు అని కూడా ప్రచారం సాగింది.

ఆమె మీద ఇలా అనేక రకాలైన ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ టీడీపీ మాత్రం ఇపుడు ఆమె విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది అంటే ఆమె పచ్చ పార్టీతో ప్యాచప్ చేసుకున్నారనే అంటున్నారు. మరి ఆమెను వైసీపీలో పెద్దగా చూపిస్తూ కీలకమైన గుంటూరు జిల్లాలో వైసీపీ తన పార్టీకి ఇబ్బందులు తెచ్చుకుంటుందా అన్నదే పార్టీలో సాగుతున్న చర్చ గా ఉంది. చూడాలి మరి హై కమాండ్ ఏ విధంగా ఆమె విషయంలో వ్యవహరిస్తుందో.

Tags:    

Similar News