అమెరికాలో విడదల రజనీ ?
వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఇతర కీలక నేతలు అంతా ఫుల్ సైలెంట్ అయ్యారు
వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఇతర కీలక నేతలు అంతా ఫుల్ సైలెంట్ అయ్యారు. పాతిక మంత్రి మంత్రులు తొలి దఫాలో పనిచేశారు. మరో పాతిక మంది మలి దఫాలో పనిచేశారు. అందులో వారు ఇందులో ఉన్నారు అనుకున్నా టోటల్ గా అయిదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో జగన్ నలభై మందికి పైగా మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
వీరిని కూడా ఉమ్మడి పదమూడు జిల్లాలో కనీసంగా ముగ్గురు వంతున తీసుకున్నారు. సామాజిక న్యాయం ఇతర లెక్కలను చూసుకుని చాన్స్ ఇచ్చారు. పార్టీ ఓడిన తరువాత వీరిలో ఎంత మంది గొంతు విప్పుతున్నారు అన్నది మాత్రం చర్చగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు ముప్పయి మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. 22 మంది లోక్ సభ కు గతసారి నెగ్గారు.
వారిలో ఓడిన వారు కూడ ఎంతో మంది ఉన్నారు. రాజ్యసభకు చేసిన వారు ఉన్నారు. వివిధ పదవులలో నియమితుర్లు అయిన వారు ఉన్నారు. వీరంతా ఇపుడు ఏమి చేస్తున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే చాలా మంది దేశం కాని దేశంలో ఉన్నారు అని అంటున్నారు
అంటే అమెరికాలో చాలా మంది ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజనీ అమెరికా వెళ్లారని అంటున్నారు. ఇక విజయవాడ లోని గన్నవరం అసెంబ్లీ నుంచి ఈసారి ఓటమి చూసిన వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు అని అంటున్నారు.
ఇలా చూస్తే వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వారిలో ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఈ తరహా డిస్కషన్స్ ఇపుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీకి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది అని అంటున్నారు.
దాంతో ఆమె మీద కూడా డిస్కషన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు. ఆమెకు అమెరికాలో బిజినెస్ లు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆమె అమెరికా వెళ్లిపోయారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
అదే విధంగా వైసీపీలో ఉన్న చాలా మంది బిగ్ షాట్స్ ఇపుడు రాజకీయాలు పక్కన పెట్టేసి తన బిజినెస్ లు తమ వ్యాపకాలు వ్యవహారాలు చూసుకుంటున్నారు అని అంటున్నారు. కొంతమంది నేతలు హైదరాబాద్ లో బిజినెస్ లు నిర్వహిస్తున్నారు. వారంతా ఏపీకి దాదాపుగా దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు
అలాగే బెంగళూరు వేదికగా చేసుకుని బిజినెస్ చేస్తున్న వారు కూడా ఇప్పట్లో ఏపీ ముఖం చూసే చాన్స్ లేదని అంటున్నారు. చెన్నై లో బిజినెస్ లు ఉన్న వారు అక్కడే తమ వ్యాపారాలలో మునిగితేలుతున్నారు అని అంటున్నారు. ఈ కీలక సమయంలో పార్టీకి అండ దండ ఎవరూ అంటే అది అతి పెద్ద ప్రశ్నగానే ఉంది.
క్యాడర్ ఒకనాడు పార్టీ కోసం చొక్కా చించుకుంది. ఇపుడు ప్రభుత్వం మారడంతో వారి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లుగా అయింది అని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక వైసీపీలో కీలకం అనుకున్న వారు ఎవరూ దాదాపుగా అందుబాటులో లేరనే చెబుతున్నారు.
మరి పార్టీని నడిపించే వారు ఏరీ అంటే అది అధినాయకత్వమే ఆలోచించాలని అంటున్నారు. కొందరు నేతలు కాస్తా వేడి తగ్గిన తరువాత మళ్లీ వెనక్కి వచ్చి అపుడు తమకు ఏది ప్రయోజనం చూసుకుని మరీ ఆ పార్టీ జెండా పట్టుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇది కష్ట కాలం అని కూడా అనకూడదు అంతకంటే పెద్ద మాటనే వాడాలి.