కిస్సింగ్ బ్రిడ్జి.. దీనికి మీద వెహికిల్స్ వెళ్లవు.. కేవలం ముద్దుల కోసమే

అవును.. మీరు చదివింది కరెక్టే. సాధారణంగా బ్రిడ్జిలు ఎక్కడైనా వాహనాలు ప్రయాణించేందుకు నిర్మిస్తారు

Update: 2023-12-29 01:30 GMT

అవును.. మీరు చదివింది కరెక్టే. సాధారణంగా బ్రిడ్జిలు ఎక్కడైనా వాహనాలు ప్రయాణించేందుకు నిర్మిస్తారు. కానీ.. ఇక్కడ ఇద్దరి మధ్య మరింత ప్రేమాభిమానాలు పెంపొందించేందుకు.. రొమాటింక్ థాట్స్ మరింత పెంచేందుకు ఏర్పాటు చేశారీ కిస్సింగ్ బ్రిడ్జి. మిగిలిన వంతెనలకు భిన్నంగా ఈ కిస్సింగ్ బ్రిడ్జి. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంతకూ ఈ కిస్సింగ్ బ్రిడ్జి ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీన్ని నిర్మించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు వస్తాయి.

వియత్నాంలోని పూక్వోక్ ద్వీపం. అందమైన బీచ్ లకు కేరాఫ్ అడ్రస్. అక్కడి సన్ సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన ఒక బ్రిడ్జి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. దీని కాన్సెప్టు రోటీన్ కు భిన్నం కావటమే. 800 మీటర్ల పైచిలుకు పొడవైన ఈ బ్రిడ్జి అందరిని ఆకట్టుకుంటోంది. దీన్ని ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ డిజైన్ చేశారు. వారం క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రాంతం ప్రేమికులకు సరికొత్త డెస్టినేషన్ గా మారింది.

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో వేసిన పెయింటింగ్ స్ఫూర్తితో దీన్ని నిర్మించటం ఒక విశేషం. ఈ బ్రిడ్జిని రెండు సగాలుగా నిర్మించారు. ఆ పెయింటింగ్ లోని రెండు చూపుడు వేళ్ల మాదిరి బ్రిడ్జి తాలుకూ రెండు సగాలు పరస్పరం కలుసుకోవు. వాటి మధ్య దూరం 30 సెంటీ మీటర్ల దూరం ఉంటుంది. దూరం నుంచి చూసినప్పుడు ఈ రెండు కొనలు కలుసుకున్నట్లుగా ఉంటాయి. కానీ.. దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం ఇవి కలుసుకోని వైనం కనిపిస్తుంది. ముద్దులు పెట్టుకోవాలనుకునే జంట ఇద్దరు చెరో వైపు నుంచి వస్తారు.

చివరి కొస వద్దకు వచ్చి ఆగే జంట.. ఇద్దరు చెరో 15 సెంటీమీటర్ల ముందుకు వంగి.. ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అని కచ్ఛితంగా చెరో 15 సెంటీమీటర్లకే వచ్చి ఆగాలని లేదు. జంట మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ కు అనుగుణంగా వంగాల్సి ఉంటుంది. ఒకరిమీద ప్రేమను మరొకరు వ్యక్తపర్చుకుంటూ పెళ్లికి ప్రపోజ్ చేసుకునే వీలుంది ఇంతకీ ఈ బ్రిడ్జి పేరేంటి? కిస్సింగ్ బ్రిడ్జేనా? అంటే కాదని చెబుతారు. దీనికి పెట్టిన పేరు ''చౌ హోన్''. దీని అర్థం ఏమిటి? అంటే.. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవటంగా చెబుతారు.

Tags:    

Similar News