విజయ్ పార్టీ కి గుడ్ న్యూస్... డీఎంకేతో ఢీకి రెడీ !
తమిళనాడులో ద్రవిడవాదం వీక్ అవుతోందని ఆ వాదమే వేదంగా భావించి డీఎంకే అన్నా డీఎంకే దశాబ్దాల పాటు రాజ్యం చేశాయని విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ భావిస్తోంది.
తమిళ నాట ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ మేరకు విజయ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చిందని అందులో పేర్కొన్నారు. అంతే కాదు ఇక మీదట ఎన్నికలలో విజయ్ పార్టీ తాము ఎంపిక చేసుకున్న గుర్తుతో పోటీ చేయవచ్చు. 2026 లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.
ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం అయిదు పదుల వయసులో ఉన్నారు. తన సినిమాలను ఆయన పూర్తి చేసి పూర్తిగా రాజకీయలా మీదనే ఫోకస్ పెడుతున్నారు.
తమిళనాడులో ద్రవిడవాదం వీక్ అవుతోందని ఆ వాదమే వేదంగా భావించి డీఎంకే అన్నా డీఎంకే దశాబ్దాల పాటు రాజ్యం చేశాయని విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ భావిస్తోంది. అవకాశ వాద రాజకీయా కోసం సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని కూడా భావిస్తోంది.
దాంతో బలమైన ద్రవిడ వాదాన్ని తాము భుజానికి ఎత్తుకోవడమే కాకుండా తమిళనాట అధిక సంఖ్యలో ఉన్న బడుగులు బహుజనుల గొంతుకగా తమ పార్టీని నిలబెట్టాలని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయ్ పార్టీ తమ పార్టీ జెండా మీద కూడా ఇరువైపులా రెండు ఏనుగుల తో పాటు ఎరుపు పసుపు రంగులను గుర్తులను పెట్టింది.
రానున్న రోజులలో మరింత విస్తృతంగా తిరిగి పర్టీని పటిష్టం చేసేందుకు విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొదట్లో పార్టీని ప్రకటించిన విజయ్ ఇటీవలే జెండాను అజెండాను కూడా ఖరారు చేశారు. తొలిసారి విసృత స్థాయిలో మీటింగ్ ని ఆయన నిర్వహించారు. రానున్న రోజూల్లో ప్రతీ జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చూస్తున్నారు. మరో వైపు చూస్తే డీఎంకే మీద ఉన్న అసంతృప్తిని తమ పార్టీకి పూర్తిగా మళ్ళేలా చూసుకుంటున్నారు.
మరి విజయ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో ఇక పార్టీలో చేరికలు జోరుగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా అన్నా డీఎంకే మీదనే విజయ్ పార్టీ కన్ను ఉందని అంటున్నారు. ఆ పార్టీలోని వారిని తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల వేళ త్రిముఖ పోరు కాస్తా ద్విముఖ పోరుగా మారుతుందని అది తమకు భారీగా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారని టాక్.