విజయమ్మ రంగంలోకి దిగుతారా ?
ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల ఇష్యూ ఎటూ తెమలడం లేదు. అది రావణ కాష్టంగా సాగుతోంది.
ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల ఇష్యూ ఎటూ తెమలడం లేదు. అది రావణ కాష్టంగా సాగుతోంది. ఇంకా చెప్పాలీ అంటే వివాదం పీక్స్ కి చేరుకుంది. ఆస్తుల వివాదంలో ఎవరికి రైట్ ఎవరిది రాంగ్ అన్నది కూడా అర్ధం కావడం లేదు. నలుగురు మనవళ్ళకు సమానంగా ఆస్తుల పంపిణీ జరగాలన్నది వైఎస్సార్ ఇచ్చిన మాండేట్ అని షర్మిల చెబుతున్నారు.
అయితే జగన్ స్వార్జితంగా వచ్చిన ఆస్తుల మీద షర్మిలకు హక్కు ఏమి ఉంటుందని వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఇక వైఎస్సార్ తో సన్నిహితంగా ఉండేవారి అందరికీ వైఎస్సార్ మనసు ఏమిటో తెలుసు అని కూడా షర్మిల చెబుతోంది. ఆమె ఆ జాబితాలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది.
అయితే ఈ ఇద్దరూ కూడా షర్మిల మీదనే గట్టిగా విరుచుకుని పడ్డారు. షర్మిల చెబుతున్నది తప్పు అని అంటున్నారు. ఆమె నానా యాగీ చేస్తోంది అని కూడా అంటున్నారు. ఆమె చంద్రబాబు మాటలు తన నోటి వెంట మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఇక షర్మిల కన్నీరు ఓట్లు అన్నీ మీడియా ముందు అయిపోయాయి. అన్నీ తన తల్లి విజయమ్మకు తెలుసు అని ఆమె ఎంతో కుమిలిపోతున్నారు అని కూడా అంటున్నారు. మరి ఒక విధంగా అన్నీ తెలిసిన వారు విజయమ్మే అయి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఆమె బయటకు వచ్చి విషయం చెబితేనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.
అయితే విజయమ్మకు గిఫ్ట్ కింద రాసిచ్చిన షేర్లను షర్మిల తన పేరిట మార్పించుకుంది అన్నదే కదా అసలు అభియోగం అని అంటున్నారు. అంటే విజయమ్మ కుమార్తె వైపే ఉన్నారు అని అనుకోవచ్చా అంటే ఆమెకు ఏమీ తెలియదు అనే వారూ ఉన్నారు. ఆమె కుమార్తె పక్షమే అని చెప్పేవారూ ఉన్నారు
ఏది ఏమైనా కూతురు దగ్గర ఉంటున్న విజయమ్మ ఈ సమయంలో బయటకు వచ్చి చెబుతారా అని కూడా అంటున్నారు. ఒక వేళ ఆమె చెబితే ఏమి చెప్పవచ్చు అన్నది మరో చర్చ. ఆమె మొగ్గు కుమార్తె వైపు అన్నది ఎన్నికల వేళ ఆమె విడుదల చేసిన వీడియో బైట్ ద్వారానే అర్ధం అయింది అని అన్న వారూ ఉన్నారు
అయితే ఆమెకు కుమారుడు కుమార్తె ఇద్దరూ సమానమే కాబట్టి ఆమె ఈ సమయంలో బయటకు వచ్చి రచ్చ చేసుకోలేరు అని కూడా మరో వాదన ఉంది. అయితే షర్మిల ఈ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. కాబట్టి విజయమ్మను ఆమె ఒత్తిడి చేసి మీడియా ముందుకు తీసుకుని వచ్చి తన వాదన రైట్ అని నిరూపించుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో ఆమె మీడియా ముందుకు రాకపోయినా తన బాధ ఇది తన ఆవేదన ఇది అని ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు
ఒకవేళ ఆమె కనుక ఈ రెండింటిలో ఏది చేసినా ఆమె కుమార్తె షర్మిలకు ఏ కాస్తా అనుకూలంగా మాట్లాడినా అది వైసీపీకి ప్రత్యేకించి జగన్ కి గట్టి షాక్ అవుతుందని అంటున్నారు. మరి వారం రోజులుగా సాగుతున్న ఆస్తుల ఇష్యూలో కొత్త వారంలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మరి విజయమ్మ కనుక రంగంలోకి దిగితే మాత్రం ఏపీలో రాజకీయంగా అగ్గి రాజుకోవడం ఖాయమనే అంటున్నారు. వైసీపీకి చూస్తే ఇది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి గా మారింది అని అంటున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి కుటుంబ కలహాల మీద ఫోకస్ చేయడం అందులోనూ సున్నితమైన అంశాలకు జవాబులు చెప్పుకోవడం అంటే వైసీపీ పూర్తిగా ట్రబుల్స్ లో పడినట్లే అంటున్నారు. ఇంతకీ విజయమ్మ బయటకు వస్తారా లేక ఆమె వాయిస్ మీడియాకు ఏ రూపంలోనైనా ఇస్తారా అంటే వెయిట్ అండ్ సీ.