విజయమ్మ ఎంట్రీతో షర్మిల అస్త్రాలు అయిపోయినట్లేనా?

వైఎస్ కుటుంబంలో.. ఆయన వారసుల మధ్య ఆస్తుల పంచాయితీ నలుగురి ముందుకు చర్చకు రావటం తెలిసిందే.

Update: 2024-10-30 06:15 GMT

వైఎస్ కుటుంబంలో.. ఆయన వారసుల మధ్య ఆస్తుల పంచాయితీ నలుగురి ముందుకు చర్చకు రావటం తెలిసిందే. తన ప్రతిభతో.. తన పాటవంతో పోగేసిన ఆస్తుల్లో వాటాను తన తల్లి.. చెల్లి అడుగుతున్నారని.. అవన్నీ తనకు తానుగా సంపాదించిన ఆస్తులుగా జగన్ క్లెయిం చేస్తున్నారు. చెల్లెలు షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇప్పటికే ఇచ్చేసానని.. ఇవ్వాల్సినవేమీ ఇక లేవన్న వాదననను జగన్ అండ్ కో వినిపిస్తోంది.

ఈ క్రమంలో షర్మిల మొదట అడుగు వేయటం.. దానికి తగ్గట్లే వైరి వర్గం మీడియాలో ప్రముఖంగా రావటం.. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ లో కేసుకు సంబంధించినఅంశాలు తెర మీదకు రావటం తెలిసిందే. ఈ విషయంలో కర్త.. కర్మ.. క్రియ షర్మిలదే అనుకోవటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. అన్నతో తనకున్న పంచాయితీ విషయంలో మొదట్నించి షర్మిల ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆమె ఆటను అర్థం చేసుకునే కన్నా.. ఆవేశంతో బదులు ఇవ్వటానికి ప్రదర్శిస్తున్న దూకుడుతనం తప్పుల మీద తప్పులు చేసేలా చేస్తోంది.

ఆస్తుల వివాదంపై జగన్ స్పందించటం.. ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి మాట్లాటం.. ఆ వెంటనే జగన్ రియాక్టుకావటం.. దానికి కొనసాగింపుగా విజయసాయిరెడ్డి తెర మీదకు రావటం చూసినప్పుడు.. షర్మిల వాదనలో వాస్తవం లేదన్న అంశాన్ని ఎస్లాబ్లిష్ చేయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారే తప్పించి.. షర్మిల అమ్ములపొదిలోఉన్న అస్త్రాన్ని మిస్ అయ్యారు. అందరు అనుకున్నట్లే విజయమ్మ కుమార్తె వైపు నిలిచారు. ఆస్తుల వివాదంలో కుటుంబ పెద్దగా ఉన్న విజయమ్మ.. గళం విప్పి లేఖ రూపంలో తాజా వివాదం విషయంలో వాస్తవాలు ఇవే అన్నట్లుగా ఆమె రియాక్టు అయిన తీరు.. ఇప్పుడు జగన్ పరివారాన్ని వేలెత్తి చూపే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో దూకుడుతనాన్ని ఆయుధంగా ఎంచుకునే వైసీపీ తీరుకు భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకుంటే.. విజయమ్మ అస్త్రాన్ని దూకుడుతనం ఎలాంటి డ్యామేజ్ చేయలేదు. ఆ మాటకు వస్తే.. ఆ తీరుతో అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. విజయమ్మ లేఖతో.. షర్మిల వద్ద ఉన్న అస్త్రాలు ఖర్చు అయిపోయాయా? అన్న ప్రశ్నను వేస్తే.. లేదనే సమాధానం వస్తోంది.

దీనికి కారణం.. వైఎస్ సోదరుడు వివేకా కుమార్తె ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన తండ్రి దారుణ హత్య ఎపిసోడ్ లో న్యాయంకోసం రోడ్ల మీదకు వచ్చిన ఆమెను.. అప్పట్లో షర్మిల అక్కున చేర్చుకోవటం తెలిసిందే. విజయమ్మతో పోలిస్తే.. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అస్త్రం చిన్నదే కావొచ్చు. కానీ.. ఎఫెక్టు ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. వీరికి పోటీగా నిలిచే అస్త్రాలు జగన్ చేతిలో ఏమీ లేవనే చెప్పాలి. సరైన అస్త్రాలు చేతిలో లేని వేళలో యుద్దం ఎలా చేస్తారన్న దానికి జగన్ ఒక ఎగ్జాంఫుల్ గా నిలవనున్నారు.

Tags:    

Similar News