విజయమ్మ మరో లేఖ...ఈసారి వారికి షాక్
ఈ సోషల్ మీడియా పోస్టులలో తన కారుకు ప్రమాదం జరిగిందని ప్రచారం మొదలెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన కుమారుడితో ముడి పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు అని విజయమ్మ పేర్కొన్నారు.
దివంగత నేత వైఎస్సార్ సతీమణి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాతృమూర్తి అయిన వైఎస్ విజయమ్మ లేటెస్ట్ గా మరో లేఖ సంధించారు. గత కొద్ది రోజుల వ్యవధిలో ఆమె బహిరంగ లేఖ రాయడం ఇది రెండోసారి. మొదటిసారి ఆమె రాసిన లేఖ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కి షాక్ గా మారింది.
ఇపుడు ఆమె రాసిన రెండవ లేఖ జగన్ కి అనుకూలంగా ఉండడం విశేషం. అదే సమయంలో జగన్ వ్యతిరేకులకు షాకింగ్ గా మారింది. ఇంతకీ విజయమ్మ లేఖలో ఏమంటారు అంటే తాను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చూసినపుడు చెడు ప్రచారం తన కుమారుడి మీద జరుగుతోందని ఆవేదనను వెలిబుచ్చారు. గత రెండు రోజులుగా సాగుతున్న దుష్ప్రచారం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తీవ్రంగా కలచివేసింది అని కూడా ఆమె పేర్కొన్నారు.
ఈ సోషల్ మీడియా పోస్టులలో తన కారుకు ప్రమాదం జరిగిందని ప్రచారం మొదలెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన కుమారుడితో ముడి పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు అని విజయమ్మ పేర్కొన్నారు.
ఇలా తన కుమారుడి మీద చెడు ప్రచారం చేయడం అత్యంత జుగుప్సాకరం అని ఆమె పేర్కొన్నారు. ఈ సోషల్ మీడియా ప్రచారం ద్వారా రాజకీయ లబ్దిని పొందాలని చూడడం దారుణం అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ఇటీవల కారు యాక్సిడెంట్ జరిగిందని విజయమ్మ కారు యాక్సిడెంట్ కి వైసీపీ అధినాయకత్వం కారణం అని ఆరోపిస్తూ పోస్టులు వస్తున్నాయి.
తన ప్రాణాలకు హాని ఉందని భావించే ఎన్నికల ముందు విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు అని కూడా సోషల్ మీడియా పోస్టులలో పేర్కొన్నారు. దీనిని బట్టి తల్లిని కూడా హత్య చేసేందుకు వెనకాడలేదని ఏకంగా వైసీపీ అధినాయకత్వం మీద ఘాటైన ఆరోపణలే చేశారు.
దీంతో విజయమ్మ స్పందించారు. అంతే కాదు ఆమె ఈ తరహా ప్రచారం బాధాకరం దారుణం అని ఖండించారు. తన కుమారుడి మీద సాగుతున్న చెడు ప్రచారంగా కొట్టి పారేశారు. దీంతో విజయమ్మ జగన్ కి మద్దతుగా ఇచ్చిన స్టేట్మెంట్ గా అంతా చూస్తున్నారు. అదే సమయంలో ఆమె తన ఇంట్లో ఆస్తుల విషయంలో ఇంటి పెద్దగా గతంలో ఒక లేఖ విడుదల చేసినపుడు జగన్ కి యాంటీ అని ప్రచారం చేశారు.
అయితే అది తమ కుటుంబం వ్యవహారం అని కూడా విజయమ్మ ఆనాడు పేర్కొన్నారు. ఇక ఆ తరువాత జగన్ వ్యతిరేకుకలు ఆ లేఖ ఒక ఆయుధంగా మారింది. దాంతో తల్లిని చెల్లెలుని ఇంటి నుంచి గెంటేశారు అని ఆరోపించిన వారే ఇపుడు తల్లిని సైతం లేకుండా చేయడానికి చూస్తున్నారు అని హేయమైన పోస్టింగులతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
దాంతో విజయమ్మ ఒక తల్లిగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. జగన్ కి మద్దతుగా ఆమె ఈ లేఖ విడుదల చేయడం విశేషం. ఎప్పటికైనా తమ కుటుంబం ఒక్కటే అని ఆమె ఈ తాజా లేఖ ద్వారా స్పష్టం చేసారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ వ్యతిరేకులకు ఈ లేఖ ఒక షాక్ అని అంటున్నారు.