విజయమ్మ తోడుగా ప్రజల ఆశీర్వాదం కోసం జగన్... పిక్చర్ క్లియర్!
ఈ రోజు ఉదయం సరిగ్గా 10:56 గంటలకు తన నివాసం నుంచి ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్... ప్రత్యేక హెలీకాప్టర్ లో కడప చేరుకున్నారు
నిన్నమొన్నటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాలనూ కవర్ చేస్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరచడానికి "సిద్ధం" అంటూ జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభల్లో.. రానున్న ఎన్నికల్లో బాధ్యతను గుర్తు చేస్తూ, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడానికి కొన్ని గంటల ముందే 175 అసెంబ్లీ 24 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ సమయంలో తాజాగా ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు.
అవును.. ఏపీలో ఎన్నికల సందడి రోజు రోజుక్లీ పీక్స్ కి చేరుకుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను కేటాయించిన జగన్... ఇక కథనరంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో భాగంగా "మేమంతా సిద్ధం" అంటూ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపుల పాయనుంచి మొదలైన ఈ యాత్ర 21 రోజుల పాటు అవిరామంగా కొనసాగి ఇచ్చాపురంలో ముగుస్తుంది. అప్పటికి పోలింగ్ తేదీకి సుమారుగా నెలరోజులు ఉంటుంది!
ఈ రోజు ఉదయం సరిగ్గా 10:56 గంటలకు తన నివాసం నుంచి ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్... ప్రత్యేక హెలీకాప్టర్ లో కడప చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ కు తల్లి విజయమ్మ ఆశీర్వాదం అందించారు. అనంతరం అక్కడ నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. దీంతో నేటి నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలైనట్లయ్యింది!
ఇక తొలిరోజు పర్యటనలో భాగంగా... వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూఉరు చేరుకుని అకక్డ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ పర్యటన సమయంలోనే జగన్.. పలు వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులూ, యువతతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి.. వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటారు.
ఇదే సమయంలో ఏప్రిల్ 9న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన విషయంలో జగన్ ముహూర్తంగా నిర్ణయించారని తెలుస్తుంది. కాగా.. ఈ సారి ఎన్నికల్లో వైనాట్ 175 అనేది మన లక్ష్యం అంటూ ఇప్పటికే కేడర్ కు జగన్ దిశానిర్ధేశం చేసిన సంగతి తెలిసిందే.