విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ గౌరవిస్తున్న వైసీపీ!

ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో సాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందించింది.

Update: 2025-01-26 04:03 GMT

వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో సాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందించింది. ఎక్స్ వేదికగా రియాక్ట్ అవుతూ.. ఆ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ గౌరవిస్తున్నట్లు తెలిపింది.

అవును... మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అటు పార్టీలోనూ ఇటు బయటా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన రాజినామాపై రకరకాల అభిప్రాయాలు, ఎన్నో రకాల విశ్లేషణలు, మరెన్నో భావానువాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ అధికారికంగా స్పందించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.

ఇందులో భాగంగా... "మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ గౌరవిస్తాము.. పార్టీ ఆవిర్భావం నుంచి మీరు బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము" అని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది వైసీపీ.

ఇదే సమయంలో.. "హార్టీకల్చర్ లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము.. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము" అని వైసీపీ రియాక్ట్ అయ్యింది!

కాగా... విజయసాయిరెడ్డి రాజీనామాపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... సాయిరెడ్డిలాంటి వ్యక్తి పార్టీని రాజీనామా చేశారంటే అది చిన్న విషయం కాదని.. ఇదే సమయంలో వివేకా హత్య విషయంలో నిజం చెప్పారని.. మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సూచించారు.

మరోపక్క... విజయసాయిరెడ్డి రాజీనామా సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎక్స్ లో ప్రత్యక్షమైన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. "రాజకీయాల్లో అనుకోకుండా ఏదీ జరగదు.. ఒకవేళ జరిగితే, అది ఆ విధంగా ప్లాన్ చే యబడిందని మీరు పందేం కూడా వేయవచ్చు" అని ఫ్రాంక్లిన్ డీ. రూజ్ వెల్ట్ కొటేషన్ ను పోస్ట్ చేశారు కేతిరెడ్డి.

దీంతో.. సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరోపక్క ఇది జగన్ వ్యూహాల్లో భాగమని ఒకరంటే.. సాయిరెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారని మరొకరు జోస్యం చెబుతున్నారు. ఈ సమయంలో.. వైసీపీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఆ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ గౌరవిస్తున్నట్లు వెల్లడించింది.

Tags:    

Similar News