సీఎంగా రేవంత్... వైసీపీ కీలక నేత ఫస్ట్ రియాక్షన్ ఇదే!

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

Update: 2023-12-06 08:27 GMT

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ సమయంలో ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా.. తెలంగాణలో చంద్రబాబు శిష్యుడిగా చెప్పే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం ఆసక్తిగా మారింది. ఈ సమయలో రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ సమయంలో తాజాగా వైసీపీ కీలక నేత స్పందించారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. డిశెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ కు ఆహ్వానం అందిందని తెలుస్తుంది. ఈ సమయంలో వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆయన ఈ సందర్భంగా రేవంత్ ను ప్రశంసించారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతోండటం పట్ల ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ స్పందించింది! ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తరువాత విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీంతో రేవంత్ ఎంపిక అనంతరం వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి... రేవంత్‌ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటులో తన సహచరుడైన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక కైనందుకు ఆయనకు విషెస్ తెలిపారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు రేవంత్ రెడ్డి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన సాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

కాగా... గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సందర్భంగా రేవంత్ తోపాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్లు తరలిరానున్నారు. ఇందులో భాగంగా... ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.

ఇదే సమయంలో ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుకున్న కేసీఆర్, చంద్రబాబు, జగన్ లు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో రేవంత్ కు కంగ్రాట్స్ చెబుతూ వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు