పొలిటికల్ ఎంట్రీకి విజయ్ మరో మాస్టర్ ప్లాన్..?
తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి వరసగా సినిమాలు చేస్తున్నాడు వరసగా హిట్లు కూడా అందుకుంటున్నాడు
తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి వరసగా సినిమాలు చేస్తున్నాడు వరసగా హిట్లు కూడా అందుకుంటున్నాడు. కెరీర్ మంచి ఊపుమీద ఉండగానే ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే డెసిషన్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆయన తీసుకొని చాలా కాలమే అవుతోంది. అయితే, ఇప్పుడు దానికి తగిన కార్యచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ లియో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందని మూవీ మేకర్స్ అధికారింగా ప్రకటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా, ఆయన తమిళనాడులో వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని బలోపేతం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని టాక్.
దీనిలో భాగంగానే వాట్సాప్ ని టార్గెట్ చేసుకున్నారు. ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, దాదాపు పదివేల వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే 1600 గ్రూపులు ఆల్రెడీ క్రియేట్ చేసేశారట. వాటితో పార్టీని, పార్టీ కార్యచరణను ప్రజల్లోకి తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. వారి టార్గెట్ ప్రకారం పదివేల గ్రూపులను కూడా త్వరలోనే క్రియేట్ చేసే అవకాశం ఉందట. ఆ గ్రూపుల్లోకి సామాన్యులను ఆహ్వానించి, వారికి విజయ్ ని దగ్గరచేయడమే వారి లక్ష్యం అని తెలుస్తోంది.
ఇక, విజయ్ కి మామూలుగానే ఫ్యాన్ డమ్ చాలా ఎక్కువ. ఆయన కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని వారిలో చాలా మంది కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకే ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు చేరువ అవ్వాలని కాకుండా, అనేక మంచి కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల మనుసులు గెలుచుకోవాలని అనుకుంటున్నారు.
ఈ రాజకీయాల కోసం ఆయన దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. ముందుగా పూర్తిగా సినిమాలకు దూరం అవ్వాలని అనుకున్నారు. కానీ, ఫ్యాన్స్ అంగీకరించకపోవడంతో, కొద్ది కాలం బ్రేక్ ఇచ్చి, తర్వాత మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.