ఆ మాత్రం ఫైర్ అవ్వాల్సిందే.. ఘాటు వ్యాఖ్యలు చేసిన వినేశ్ ఫొగాట్

అసలేం జరిగిందంటే.. రెజ్లింగ్ లో ఆమె ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపుగా హర్యానా ప్రభుత్వం రూ.4 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-14 10:30 GMT
ఆ మాత్రం ఫైర్ అవ్వాల్సిందే.. ఘాటు వ్యాఖ్యలు చేసిన వినేశ్ ఫొగాట్

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా కాలం. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియా స్పందన ఆధారంగానే తమ బతుకులు ఉండాల్సిన దుస్థితిలోకి చేరుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. మరికొందరు.. అలాంటి అవకాశమే ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే.. తమకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. కొన్ని ఉదంతాల ఆధారంగా తిట్టిపోసే ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వారు లేకపోలేదు. అలా విమర్శల్ని ఎదుర్కొంటున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తనదైన శైలిలో విరుచుకుపడింది.

అసలేం జరిగిందంటే.. రెజ్లింగ్ లో ఆమె ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపుగా హర్యానా ప్రభుత్వం రూ.4 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆమె పారిస్ ఒలింపిక్స్ లో అనర్హతను ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆమె బరువు అధికంగా ఉండటమే. ఫైనల్ కు చేరినప్పటికి బరువు ఎక్కువగా ఉండటంతో ఆమె వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే.. హర్యానా ప్రభుత్వం మాత్రం తాను ఇస్తానని మాట ఇచ్చిన రూ.4 కోట్లు ఇస్తానని ప్రకటించింది.

దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ స్పందన మొదలైంది. రూ.4 కోట్ల బహుమతిని ఎలా తీసుకుంటావు అంటూ ఆమెను విమర్శిస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో.. ఆమె స్పందించింది. తనను తిట్టిపోస్తున్న వారికి ఒక పంచ్ ఇచ్చినట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. తనకు కోట్లు ఇస్తామని శీతల పానీయాలు ఆఫర్ ఇచ్చాయని.. ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు కూడా ఆఫర్లు ఇచ్చినా తాను వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

విలువల విషయంలో తానెప్పుడూ రాజీ పడలేదని.. తాను సాధించింది మొత్తం నిజాయితీతోనే కష్టపడినట్లుగా వ్యాఖ్యానించిన ఆమె.. ‘నోర్మూసుకొని ఒక మూలకు కూర్చొని ఏడవండి. నోరు పారేసుకోకండి’ అంటూ ఘాటుగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News