రెజ్లర్ వినేశ్ ట్వీట్ పై సోదరి భర్త రియాక్షన్.. నెట్టింట రచ్చ రచ్చ!
ఇందులో భాగంగా... “వినేశ్.. నువ్వు రాసిన పోస్ట్ చాలా బాగుంది” అని అంటూనే... "అందులో నువ్వు మీ పెదనాన్న మహవీర్ ఫోగాట్ ను మరిచిపోయినట్లున్నావు" అని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫైనల్ కు చేరిన ఆమె అయితే స్వర్ణం, కాకపోతే రజత పతకం కన్ఫాం గా తెస్తారని ఫిక్సైన నేపథ్యంలో... అనూహ్యంగా ఆమెపై అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం ఆశలు ఆవిరైపోయాయి.
ఈ సమయంలో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... కుస్తీ తనపై గెలిచిందని, తాను ఓడిపోయానని, తనను క్షమించాలని ఆమె వెల్లడించారు. ప్రజలు తనపై పెట్టుకున్న కల, ఆమె ధైర్యం విచ్ఛిన్నమైపోయాయని.. ఇక తనకు పోరాడే బలం లేదని ఆమె వెల్లడించారు. ఈ ఆమెకు అన్ని వైపుల నుంచీ భారీ మద్దతు లభించింది.
ప్రధానంగా ఆమె పెద్దనాన్న మహావీర్ ఫోగాట్ నుంచి ఆమెకు సంపూర్ణ మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో ఆమె పారిస్ నుంచి భారత్ కు చేరుకున్నారు. దీంతో.. ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎత్తున ఫ్యాన్స్ ఆమెకు వెల్ కం పలికారు. అంతకు ముందు ఆమె ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడు అందులో ప్రస్థావించని ఓ విషయం వైరల్ గా మారింది.
అవును.. భారత్ చేరుకునే ముందు వినేష్ ఫోగాట్ ఓ పోస్ట్ పెడుతూ అనేక విషయాలను వెల్లడించింది. తన భర్త, కుటుంబం, కోచ్ ల పాత్రపై పలు కీలక విషయాలను పంచుకుంది. అయితే... ఆమె పెదనాన్న మహవీర్ గురించి మాత్రం ఆమె ఎక్కడా ప్రస్థావించినట్లు లేదు. దీంతో.. వినేశ్ ఫోగాట్ సోదరి భర్త, రెజ్లర్ పవన్ సరోహా ఈ విషయాన్ని గుర్తు చేశాడు.
ఇందులో భాగంగా... “వినేశ్.. నువ్వు రాసిన పోస్ట్ చాలా బాగుంది” అని అంటూనే... "అందులో నువ్వు మీ పెదనాన్న మహవీర్ ఫోగాట్ ను మరిచిపోయినట్లున్నావు" అని అన్నారు. ఈ సందర్భంగా.. "నీ రెజ్లింగ్ కెరీర్ కు పునాది వేసిన వ్యక్తి ఆయన" అని గుర్తు చేసిన పవన్... "దేవుడు నీకు స్వచ్ఛమైన తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని పోస్ట్ పెట్టాడు. .
దీంతో... ఇప్పుడు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు.