బ్రేకింగ్... పవన్ కు విశాఖ పోలీసుల నోటీసులు!

ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ కు విశాఖ తూర్పు ఏసీపీ సెక్షన్ 30 కింద నోటీసులు అందించారు.

Update: 2023-08-11 10:57 GMT

ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముందుగానే పవన్ కు అందజేసిన పోలీసుల నిబంధనలను ఉల్లంఘించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై నోటీసులు ఇచ్చారు.

అవును... జనసేన అధినేత పవన్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీచేశారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో.. పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ కు విశాఖ తూర్పు ఏసీపీ సెక్షన్ 30 కింద నోటీసులు అందించారు.

ఇందులో భాగంగా... బహిరంగ సభలో పవన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, పవన్‌ అలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇదే సమయంలో విశాఖలోని రుషికొండలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని తేల్చి చెప్పారు.

కాగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో దశలో భాగంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన సంగతి తెలిల్సిందే. ఇందులో భాగంఘా ఎయిర్ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే పవన్ నగరంలోకి రావాలని పోలీసులు సూచించారు. ఇదే సమయంలో మార్గ మధ్యలో రోడ్ షోలు చేయడం, కారులో నుంచి బయటికి వచ్చి అభిమానులకు చేతులు ఊపడం చేయవద్దని తెలిపారు! ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు.

అయితే గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఉంటారని అంటున్నారు కామెంట్లు వినిపించాయి. అప్పట్లో పవన్ వైజాగ్ కు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు ఎదురుగా వచ్చిన ఏపీ మంత్రులపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. పవన్ యాత్రలపై పోలీసులు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది!

Tags:    

Similar News