జగన్ మీద బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఆయన తన స్పీచ్ లో వేసిన పంచులు హాస్యపు గుళికలతో సభలోని సభ్యులను నవ్వించారు.
ఏపీ అసెంబ్లీలో విశాఖలోని రుషికొండ ప్యాలెస్ మీద చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అయిదు వందల కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ లో లేనిది అంటూ లేదని బీజేపీ శాసససభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు సెటైర్లు వేశారు
ఆయన తన స్పీచ్ లో వేసిన పంచులు హాస్యపు గుళికలతో సభలోని సభ్యులను నవ్వించారు. ఎంతటి విలాసవంతంగా ఈ ప్యాలెస్ ని నిర్మించారంటే అక్కడా బాత్ రూం లో అమర్చిన కమోడ్ కే 11 లక్షలకు పైగా ఖర్చు అయింది. ఇది ఆటో వాష్ కమోడ్ అధ్యక్షా అంటూ ఆయన ఆసక్తికరమైన అంశాలనే చెప్పారు.
ఇక మనం చేయాల్సింది అక్కడ కూర్చోవడమే. ఆటో వాష్ కమోడ్ మిగిలిన పని అంతా అదే చేస్తుంది. ఆఖరికి మన చేతులు కూడా బాత్ రూం లో ఎక్కడా ఉపయోగించాల్సిన అవసరమే లేదు అని విష్ణు కుమార్ రాజు సెటైరికల్ గా చెబుతూ సభలో నవ్వులు పూయించారు.
ఇలాంటి ప్యాలెస్ ఇలాంటి ఆల్ట్రా మోడర్న్ సదుపాయాలను జగన్ కోరుకున్నారు అని అంటూ ఆయన విమర్శించారు. రుషికొండలో పూర్తి స్థాయిలో విలాసవంతమైన ప్యాలెస్ ని జగన్ అత్యంత సాహసోపేతంగా నిర్మించారు అని ఆయన అన్నారు. అయిదు వందల కోట్ల మెగా నిర్మాణంతో సాగిన ఈ ప్యాలెస్ లో అసలు అంతూ పొంతూ లేని సదుపాయాలు ఎన్నో ఉన్నాయని రాజు చెప్పారు.
ఇలా ప్రజా ధనాన్ని భారీ మొత్తంలో ఖర్చు చేయడం ద్వారా తన విలాసం ఏంటో జగన్ చెప్పారని ఆయన విమర్శించారు. అత్యంత విలాసవంతమైన జీవన శైలి వైసీపీ అధినాయకుడిది అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఈ తరహా సదుపాయాలను జగన్ కోరుకున్నారు అని ఆయన అన్నారు
రుషికొండ నిర్మాణం అన్నది ప్రజా దుబారా అంటూ ఇలా వృధా ఖర్చు చేసిన వారి మీద ఏ విధమైన చర్యలు అయినా తీసుకోవచ్చు అని అన్నారు. మొత్తం మీద చూస్తే రుషికొండ ప్యాలెస్ కాదు కానీ జగన్ మీద కూటమి నేతలు అంతా చెడుగుడు ఆడుకుంటున్నారు.
అది ప్రభుత్వం కోసం నిర్మించింది మీరు ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అని వైసీపీ నేతలు చెబుతూంటే అలా కాదు అది జగన్ విలాసం కోసం కట్టుకున్నారు అని కూటమి నేతలు అంటున్నారు. రుషికొండ మీద ఇంతటి అధికార దుర్వినియోగం ప్రజా దుర్వినియోగం చేయాలా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్ హయాంలో అభివృద్ధి లేదని ఒక వైపు చెబుతున్న కూటమి నేతలు ఆయన నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ప్రజా నిధుల ధనం దుర్వినియోగం అని చెబుతూ రెండిందాలుగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రుషికొండ నిర్మాణ భారం అంతా జగన్ పూర్తి స్థాయిలో మోయక తప్పేట్లు లేదని అంటున్నారు.