షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే!
అవినాష్ కు టిక్కెట్ ఇవ్వడంపై జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ప్రధానంగా వివేకా హత్య కేసును ప్రస్థావిస్తూ... వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అవినాష్ కు టిక్కెట్ ఇవ్వడంపై జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరుపున కడప లోక్ సభ అభ్యర్థిగా షర్మిళ పోటీకి దిగిన అనంతరం సునీత - షర్మిళ కలిసి వైఎస్ వివేకా హత్య టాపిక్ పీక్స్ కి తీసుకెళ్లారనే కామెంట్లు వినిపించాయి. హంతకులకు టిక్కెట్లు ఇచ్చారాని.. ఆ విషయం తాము చెప్పడం లేదని.. సీబీఐ పేర్కొన్న విషయాన్నే తాము ఉంటంకిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో హంతకులకు జగన్ టిక్కెట్లు ఇస్తున్నారనే కామెంట్లూ చేసిన పరిస్థితి!
దీంతో... వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా... హత్య కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు.. హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. అయితే... ఆ విషయం కడప కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడం.. ఈ సమయంలో మరోసారి కోర్టును ఆశ్రయించడంతో జరిమానా కూడా విధించడం తెలిసిందే! ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిగింది.
అవును... ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది! ఫలితంగా.. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.