నాకు ఎంతమంది అక్కచెల్లెళ్లు ఉన్నారో తెలీదు.. ఎలన్ మస్క్ కుమార్తె
మస్క్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ రెడ్డిట్ ద్వారా స్పందిస్తూ, తనకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలియదని అన్నారు.
బిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించడంలోనే కాదు.. ఒకరికి మించి భార్యలతో సంసారం చేయడం, వారికి లెక్క లేనంత మంది బిడ్డల్ని కనడం ఎలన్ మస్క్ హ్యాబిట్. దీనిపై మీడియాలో చాలా కథనాలొచ్చాయి. ఎలోన్ మస్క్‌కు ముగ్గురు మహిళలతో 12 మంది పిల్లలు ఉన్నట్లు గతంలో వెల్లడైంది. అతడి మాజీ భార్య జస్టిన్ విల్సన్, సంగీతకారిణి గ్రిమ్స్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ అతడి ముగ్గురు భార్యలు.
2002లో ఎలోన్ మస్క్ - జస్టిన్ విల్సన్ దంపతులకు జన్మించిన వివియన్ విల్సన్, 2022లో తన పేరు, లింగాన్ని మార్చుకుంది. ఆమె తన జీవ సంబంధీకుడైన తండ్రి నుండి తనను తాను దూరం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఎలోన్ మస్క్ నుంచి విడిపోయిన కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ తన ఇతర తోబుట్టువుల గురించి తనకు తెలియదని, తన తండ్రి పదమూడవ బిడ్డ గురించి రెడ్డిట్ ద్వారా తెలుసుకున్నానని చెప్పింది. మస్క్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ రెడ్డిట్ ద్వారా స్పందిస్తూ, తనకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలియదని అన్నారు.
ఇన్ఫ్లుయెన్సర్ ఆష్లే సెయింట్ క్లెయిర్ తనకు ఎలోన్ మస్క్ తో ఒక బిడ్డ పుట్టిందని పేర్కొన్నారు. ఆమె ఎక్స్‌లో తన ఐదు నెలల బిడ్డకు ఎలోన్ మస్క్ తండ్రి అని బహిరంగంగా పేర్కొంది. దానికి ప్రతిస్పందిస్తూ, వివియన్ తన థ్రెడ్స్ ఖాతాలో ఇలా రాసింది ``ఆన్‌లైన్‌లో కొత్త తోబుట్టువులు ఉన్నారని తెలుసుకున్న ప్రతిసారీ నాకు చాలా వింతగా అనిపించేది. ఆరుసార్లు అలా జరిగింది. నాకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలియదు`` అని కూడా వివియన్ రాశారు. సత్యాసత్యాలను నిజాయితీగా ఒప్పుకుంటానని కూడా అన్నారు.
ఎలోన్ మస్క్‌కు జస్టిన్ విల్సన్‌తోను సంబంధం ఉండేది. ఈ జంట 2000లో వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్లకు విడాకులు తీసుకున్నారు. వారాల తర్వాత 2008లో తలులా రిలేతో మస్క్ డేటింగ్ ప్రారంభించాడు. ఈ జంట పెళ్లయ్యాక రిలేషన్ కేవలం రెండేళ్లే కొనసాగింది. మస్క్ 2015లో ప్రముఖ కథానాయిక అంబర్ హర్డ్‌తో రహస్యంగా డేటింగ్ చేశాడు. వారు 2017లో విడిపోయారు. మస్క్, సంగీతకారుడు క్లైర్ ఎలిస్ బౌచర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. మే 2020లో వారి మొదటి బిడ్డను స్వాగతించారు. ఈ జంట 2022లో మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. అదే సంవత్సరం వారు విడిపోయారు. ఎలోన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారు అతడితో బంధాన్ని తిరస్కరించారు.