లోదుస్తులు, చెప్పులపై వినాయకుడి బొమ్మలు... వాల్ మార్ట్ పై నిప్పులు!

అలాంటి వాల్ మార్ట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే పని చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Update: 2024-12-09 10:03 GMT

ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ చైన్ ను నడుపుతున్న ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ వాల్ మార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఈ స్టోర్స్ లో లభించని వస్తువంటూ ఉండదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అలాంటి వాల్ మార్ట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే పని చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అవును... ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ వాల్ మార్ట్ తాజాగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే పనికి పూనుకుంది! ఇందులో భాగంగా... చెప్పులు, లోదుస్తులు, స్విమ్ సుట్ లు మొదలైన వాటిపై వినాయకుడి ఫోటోలను ప్రచురించింది. దీనిపై యూఎస్ లోని హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో అనేక మంది వినియోగదారులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ రిటైల్ దిగ్గజంపై విరుచుకుపడుతున్నారు. ఆ వస్తువులన్నింటినీ అమ్మకాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలా చేసిన పనికి తీవ్రమైన ఎదురు దెబ్బలూ తగలడంతో చెప్పులు, సాక్సులు, లోదుస్తులు సహా అనేక వస్తువులను వెబ్ సైట్ నుంచి తొలగించింది వాల్ మార్ట్. అయితే... వినాయకుడిని ముద్రించిన స్విమ్ సూట్ లు వంటివి మాత్రం మరికొన్ని ఇంకా అందుబాటులో పెట్టిందని అంటున్నారు. ఈ మేరకు.. హిందు-అమెరికన్ ఫౌండేషన్ (హెచ్.ఏ.ఎఫ్) విరుచుకుపడింది.

ఈ సందర్భంగా... ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది కొలిచే ఆరాధ్య దైవం, వారి అడ్డంకులను తొలగించే వినాయకుడిని అమర్యాదకరంగా చిత్రీకరించిన వస్తువులను వెంటనే తొలగించాలని వాల్ మార్ట్ ని ఎక్స్ వేదికగా కోరింది. ఈ సందర్భంగా వాల్ మార్ట్ ప్రతినిధితో జరిగిన సంభాషణను పోస్ట్ చేసింది.

కాగా... ఎంతో కొంత చౌక ధరకే వస్తువులు లభించడంతో ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో రిటైల్ ఔట్ లెట్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు. అయితే... ఇది భారతదేశానికి వచ్చేసరికి.. స్థానిక వ్యాపారాలు దెబ్బతింటాయని, ఉద్యోగాలు పోతాయని, వ్యాపారులు రోడ్డున కాంగ్రెస్ హయాంలో దీన్ని అడ్డుకున్నారు.

అయితే... మోడీ సర్కార్ వచ్చిన తర్వాత నెమ్మదిగా భారత్ లోను వాల్ మార్ట్ విస్తరించింది.. విస్తృతంగా ఔట్ లెట్ లను ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ లోనూ పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే... దీన్ని భారత్ నుంచి తరిమివేయాలంటూ ప్రధాని మోడీకి వీ.హెచ్.పీ, ఆర్.ఎస్.ఎస్. సంస్థలు లేఖలు రాసాయనే చర్చ ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News