వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి మేలు చేస్తుందా ?
దేశంలో వక్ఫ్ బిల్లు మీదనే ఇపుడు హాట్ టాపిక్ గా చర్చ సాగుతోంది. ఈ బిల్లుని లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోనుంది.;

దేశంలో వక్ఫ్ బిల్లు మీదనే ఇపుడు హాట్ టాపిక్ గా చర్చ సాగుతోంది. ఈ బిల్లుని లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోనుంది. ఇక్కడ ఆమోదం పొందితే రాజ్యసభలో రేపు బిల్లు రావచ్చు. లోక్ సభలో 272, రాజ్యసభ 119 సాధారణ మెజారిటీ ఉంటే చాలు బిల్లు పాస్ అయిపోతుంది. ఎన్డీయే కూటమికి లోక్ సభలో మిత్రులతో కలుపుకుని 290కి పైగా ఎంపీల మద్దతు ఉంది. అలాగే రాజ్యసభలో 125 మంది దాకా సభ్యుల బలం ఉంది. దాంతో చాలా ఈజీగా బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారనుంది.
ఇక విపక్షాలు ఎటూ యాంటీగా ఓటు చేస్తాయి. వాటితో పాటుగా వైసీపీ బీఆర్ ఎస్ వంటి తటస్థ పార్టీలూ ఎ బిల్లుకు వ్యతిరేకగానే ఓటు చేస్తాయని అంటున్నారు. ఇక వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని పాత బిల్లు బ్రిటిష్ కాలం నాటిదని అంటున్నారు. ఈ బిల్లుని సవరించడం ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
గతంలో ట్రిపుల్ తలాఖ్ సమయంలోనూ అనేక భయ సందేహాలను వ్యక్తం చేసిన చివరికి ముస్లిం మహిళా సమాజం స్వాగతించింది అని గుర్తు చేస్తున్నారు. ఈ బిల్లు విషయంలో అదే జరుగుతుంది అని అంటున్నారు. మరి ఆ విధంగా ఈ బిల్లు మేలు చేస్తుందా చేస్తే జరిగేది ఏమిటి అన్న చర్చ అయితే ఉంది.
అయితే వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములు కానీ ఆస్తులు కానీ ఒక క్రమబద్ధీకరణ కిందకు రావాలని అలాగే వాటి ప్రయోజనాలు అదే సామాజిక వర్గంలోని పేదలకు అందాలని అంటున్నారు. ఈ బిల్లులో పేద ముస్లిం ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
అలాగే వక్ఫ్ భూములకు సంబంధించినవి అన్నీ క్రమబద్ధీకరించడం కాకుండా వాటిని ఉపయుక్తం లోకి తీసుకుని రావడం కూడా లక్ష్యంగా ఉందని అంటున్నారు. చాలా భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని వాటి యాజమాన్య హక్కుల మీద కూడా చర్చ ఉందని అందుకే ఈ బిల్లు కనుక వస్తే అనేక దీర్ఘ కాలిక సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా పేదలైన ముస్లిం లకు న్యయం జరుగుతుందని అంటున్నారు.
ఇక ఈ బిల్లు మీద ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షమ్స్ అనుకూలంగా మాట్లాడడం విశేషం. మోడీ ప్రభుత్వ సంస్కరణలకు ఈ బిల్లు నిదర్శనం అన్నారు. పేద ముస్లింలు ప్రధాని మోడీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. పేద ముస్లింలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని కూడా చెప్పుకొచ్చారు.
ఈ బిల్లు మీద వివాదాలు అన్నీ ప్రతిపక్షాల వల్లనే అంటూ ప్రతిపక్షాలను విమర్శించడంలో కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. వక్ఫ్ వనరులను దోపిడీ చేస్తున్నారని ఇప్పటిదాకా పేదల హక్కులను దోచుకున్నారు అని కూడా ఆరోపించారు.
మసీదులను లాక్కుంటారని చెప్పి ముస్లింలను భయపెడుతున్నారని అది నిజం కాదని అన్నారు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న వారు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ జనతాదళ్‌కు చెందిన రాజకీయ నేతలే అన్నారు. ఇవన్నీ చూస్తూంటే నిజంగా ఈ బిల్లు సంస్కరణలకు నోచుకుని పేద ముస్లింలకు న్యాయం జరిగితే మాత్రం ఎన్డీయే ప్రభుత్వం పేరు చిరస్థాయిగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ బిల్లు మీద సందేహాలు ఎలా ఉన్నాయో ప్రయోజనాలూ ఉన్నాయని వాదనలు ఉన్నాయి.