ఘోరం: తలకిందులుగా నదిలో పడిన విమానం... మొత్తం చనిపోయారు!

ఇందులో భాగంగా... విమానంలో ఉన్న మొత్తం 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అన్నారు.

Update: 2025-01-30 14:44 GMT

అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో మృతిచెందిన వారిపై అగ్నిమాపక శాఖ చీఫ్ షాకింగ్ విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... విమానంలో ఉన్న మొత్తం 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అన్నారు. ఈ విషయం షాకింగ్ గా మారింది.

అవును... వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ చీఫ్ జాన్ డొన్నెలీ వెల్లడించారు. ఇప్పటివరకూ 28 మంది మృతదేహాలను నదిలోంచి బయటకు తీసినట్లు తెలిపారు. విమానంలో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పిన ఫైర్ చీఫ్... గత 24 ఏళ్లలో అమెరికలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే అని అన్నారు. హెలికాప్టర్ ఢీకొన్న అనంతరం పెద్ద శబ్ధంతో విమానం తలకిందులుగా నదిలో పడి అడుగుభాగంలో కూరుకుపోయిందని.. దానికి సమీపంలోనే హెలికాప్టర్ శకలాలను గుర్తించామని ఆయన వెల్లడించారు.

కాగా... అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పీ.ఎస్.ఏ. ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం రన్ వే పై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్ ను ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా.. హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారు.

ఈ ఘటనపై స్పందించిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉందని.. విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయని చెప్పిన ట్రంప్... అయినప్పటికీ ఆ విమానం కిందకో, మీదకో, పక్కకో హెలీకాప్టర్ ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని అన్నారు.

విమానాన్ని చూశారా అని అడిగే బదులు.. ఏమి చేయాలో కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. ఇలా జరగడం ఏమాత్రం సరిగా లేదని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News