1990 - 2012 టాటా గ్రూప్ లో ఓ స్వర్ణయుగం... ఎలాగంటే...?

కారణం... ఆ సమయంలో టాటా గ్రూపుకు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో 1991లో టాటా గ్రూపు సంపద 5.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

Update: 2024-10-10 04:13 GMT

ఏ సంస్థకైనా.. ఏ వ్యక్తికైనా.. ఓ కీలక సమయం అని ఒకటి ఉంటుంది! అది మనిషి జీవితంలో అయితే శుక్రమహర్ధశ అని (సరదాగా) వ్యాఖ్యానించినా.. సంస్థ విషయంలో మాత్రం దాన్ని ఓ స్వర్ణయుగం అనే భావించాలి. సినిమా స్టార్ లకు బ్రేక్ వచ్చినట్లు, క్రీడాకారులకు టర్నింగ్ పాయింట్ అన్నట్లు సాగే అలాంటి దశ టాటా గ్రుపుకు కూడా రతన్ టాటా పిరియడ్ లో వచ్చింది.

అవును... 1990 - 2012 కాలాన్ని టాటా గ్రూపుకు స్వర్ణయుగంగా చెబుతుంటారు చాలా మంది నిపుణులు. కారణం... ఆ సమయంలో టాటా గ్రూపుకు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో 1991లో టాటా గ్రూపు సంపద 5.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడ నుంచి రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూపు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతూ ముందుకు కదిలింది.

1991లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూపు సంపద 2016 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేరిందంటే.. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. తన 25 లిస్టెడ్ కంపెనీల ద్వారా టాటా గ్రూపు 2024లో రూ.85,510 కోట్ల లాభాలను ఆర్జించిందంటే ఆయన కృషి గురించి అర్ధంచేసుకొవచ్చు. దేశం ఫస్ట్, ప్రాఫిట్ నెక్స్ట్ అంటూ సాగినా... ఆయన వ్యాపారం ఈ స్థాయిలో అభివృద్ధి పథంలో నడిచింది.

21 ఏళ్లపాటు టాటా గురూపుకు ఛైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా.. తన హయాంలో వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించారు. ఆయన హయాంలోనే గ్రూపు ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయంటే ఆయన కృషి ఏ స్థాయిలో సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత హోదాలో 30 స్టార్టప్ లలోనూ ఆయన పెట్టుబడులు పెడుతూ.. పలువురిని ప్రోత్సహించారు.

వాటిలో ఓలా ఎలక్ట్రిక్, స్నాప్ డీల్, లెన్స్ కార్ట్, పేటీఎం, మొదలైన సంస్థలున్నాయి. అంతకంటే మందు దేశంలోని ఆర్థిక సంస్కరణల సమయంలో టాటా గ్రూపును పునర్వ్యవస్థీకరించిన ఆయన... స్థానికంగా రూపొందించిన టాటా నానో, ఇండికా కార్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇదే క్రమంలో 2024 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు.

ఇదే క్రమంలో... తన హయాంలో అంతర్జాతీయంగానూ టాటా గ్రూపూను విస్తరించడంలో రతన్ టాటా ఎనలేని కృషి చేశారు. ఇందులో భాగంగా... ఆంగ్లో-డచ్ స్టీల్ కంపెనీ కోరస్ ను టేకోవర్ చేసిన ఆయన... బ్రిటీష్ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ ను కనుగోలు చేశారు. ఇదే సమయంలొ అదే దేశానికి చెందిన టీ కంపెనీ టెట్లీని కొన్నారు.

2012న టాటా గ్రూప్ ఛైర్మన్ గా పదవీ విరమణ చేసిన తర్వాత తిరిగి 2016లో మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా.. టాటా గ్రూపుకు ఛైర్మన్ అయ్యారు. అనంతరం 2017లో నటరాజన్ చంద్రశేఖరన్ ను గ్రూపు ప్రధాన సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ గా నియమించారు. అప్పటి నుంచీ రతన్ టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా వ్యాపారంలో క్రియాశీలకంగా ఉన్నారు.

Tags:    

Similar News