4000 ఏళ్ల చరిత్ర.. తూర్పున ఉండి కూడా పశ్చిమ బెంగాల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బెంగాల్ తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది.;

Update: 2025-04-05 00:30 GMT
4000 ఏళ్ల చరిత్ర.. తూర్పున ఉండి కూడా పశ్చిమ బెంగాల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

పశ్చిమ బెంగాల్ భారతదేశ తూర్పున ఉన్న ఒక రాష్ట్రం. దీని చరిత్ర దాదాపు 4000 సంవత్సరాల నాటిది. "ఫూట్ డాలూ నీతి కరో" (విభజించు పాలించు) విధానంతో భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు దీనిని విభజించారు. అయితే ప్రజల్లో ఆగ్రహం పెరగడంతో 1911లో బెంగాల్‌ను మళ్లీ ఏకం చేశారు. వాస్తవానికి బెంగాల్ భారతదేశ తూర్పున ఉన్నప్పటికీ, దానిని పశ్చిమ బెంగాల్ అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం,

బెంగాల్‌ను పశ్చిమ బెంగాల్ అని ఎందుకు పిలుస్తారు?

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బెంగాల్ తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. తూర్పు బెంగాల్ తరువాత బంగ్లాదేశ్‌గా మారింది. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగమైంది. అంతకు ముందు పశ్చిమ బెంగాల్..బెంగాల్ ఒకే ప్రావిన్స్‌గా ఉండేవి. కానీ 1947 తర్వాత తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) ఏర్పడ్డాయి. 1971లో తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. దాని పశ్చిమ భాగమే నేడు పశ్చిమ బెంగాల్‌గా పిలువబడుతోంది. బెంగాల్ అనే పేరు బంగ్లాలోని ప్రాచీన వాంగ , బంగా అనే పదాల నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 4000 సంవత్సరాల క్రితం నాగరికత అవశేషాలు కనిపిస్తాయి. దీనిని ద్రావిడులు, ఆస్ట్రో-ఆసియాటిక్ , టిబెటన్ బర్మన్లు స్థాపించారు.

భారతదేశంలో బెంగాల్ చరిత్ర

భారతదేశంలో బెంగాల్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో బెంగాల్‌లో గంగారిడై అనే సామ్రాజ్యం ఉండేది. ఇక్కడ గుప్త, మౌర్య చక్రవర్తుల ప్రత్యేక ప్రభావం ఉంది. దీని తరువాత శశాంకుడు బెంగాల్ రాజు అయ్యాడు. శశాంకుడు పూర్వార్ధంలో ఈశాన్య భారతదేశంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తరువాత అధికారం గోపాలుడి చేతికి వెళ్లి పాల వంశం స్థాపించబడింది. పాల సామ్రాజ్యం 400 సంవత్సరాలు పాలించింది. దీని తరువాత బెంగాల్‌లో సేన వంశం పాలన సాగింది. ఈ పాలనను ఢిల్లీ పాలకులు ఓడించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం విభజన

1757లో ప్లాసీ యుద్ధం తరువాత ఆంగ్లేయులు బెంగాల్, భారతదేశంలో తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని విభజించారు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకడంతో 1911లో బెంగాల్‌ను మళ్లీ ఏకం చేశారు. వీటన్నిటి కారణంగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. ఫలితంగా 1947లో విభజన జరిగింది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వదేశీ సంస్థానాలు విలీనమయ్యాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం కొన్ని బెంగాలీ మాట్లాడే ప్రాంతాలను పశ్చిమ బెంగాల్‌లో కలిపారు.

Tags:    

Similar News