ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు.. సిబిఐ అధికారులపై ఆరోపణలు
ఈ నేపథ్యంలోనే మృతురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులో జరుగుతున్న విచారణకు సిబిఐ అధికారులు తమను పిలవలేదంటూ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురై హత్య గావించబడిన యువ వైద్యురాలి కేసుకు సంబంధించి శనివారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును స్థానిక సీల్దా కోర్టు వెలువరించనుంది.
ఈ నేపథ్యంలోనే మృతురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులో జరుగుతున్న విచారణకు సిబిఐ అధికారులు తమను పిలవలేదంటూ పేర్కొన్నారు. తమ లాయర్ కూడా కోర్టుకు వెళ్లవద్దని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి సిబిఐ అధికారులు ఒకటి, రెండుసార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారని, విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తే జరుగుతోందని మాత్రమే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించిన ఎటువంటి వివరాలను తమకు తెలియజేయడం లేదని వాపోయారు. తమ కూతురి గొంతుపై గాయాలు ఉన్న స్వాబ్ సేకరించలేదని సంచలన వ్యాఖ్యలు తయారు చేశారు.
ఈ కేసును ఛేదించడానికి సిబిఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టుగా డిఎన్ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారుల పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలు తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సిబిఐ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేసు విచారణ సరిగా జరగలేదు అన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కోల్‌కతాలోని ఆర్థిక ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 162 రోజులు తర్వాత తీర్పు వెలువడనుంది. ఈ సమయంలో ఆయన తండ్రి చేసిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఘటనపై విచారణ చేస్తున్న పోలీస్ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆగస్టు 13న కోల్‌కతా పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వీకరించింది.
దర్యాప్తులో భాగంగా దాదాపు 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలను సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని ఉపయోగపత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలో సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించారు. కొన్ని నెలలపాటు విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది.