మహాలక్ష్మిని ముక్కలు చేసిన రాయ్ ఆత్మహత్య లేఖలో ఏముంది?
ఈ హత్య తాను ఎందుకు చేసింది.. ఎప్పుడు చేసింది.. ఎలా చేసింది వివరించాడు.
తీవ్ర సంచలనం సృష్టించిన బెంగళూరులోని మహాలక్ష్మి హత్య కేసులో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మహాలక్ష్మీ హత్య కెసు నిందితుడు ముక్తిరంజన్ రాయ్ తన సూసైడ్ లెటర్ లో కీలక విషయాలను ప్రస్థావించాడు. ఈ హత్య తాను ఎందుకు చేసింది.. ఎప్పుడు చేసింది.. ఎలా చేసింది వివరించాడు.
అవును... బెంగళూరులో సంచలనానికి కారణమైన మహాలక్ష్మీ హత్య కేసు నిందితుడు ముక్త్తిరంజన్ రాయ్ తన ఆత్మహత్య లేఖలో కీలక విషయాలు వెళ్లడించాడు. ఇందులో భాగంగా... తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ.. తనతో గొడవపడటంతో పాటు.. తనపై దాడి చేసి కొట్టిందని.. దీంతో నా ఆత్మాభిమానం దెబ్బతిందని రాసుకొచ్చాడు.
దీంతో... ఆమెను గొంతు నులిమి చంపినట్లు తెలిపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆక్సిల్ బ్లేడ్ తో 59 ముక్కలు చేసి, ఫ్రిజ్ లో ఉంచి, వాసన రాకుండా కొన్ని రసాయనాలు పిచికారి చేసి, ఆ బాత్ రూమ్ ని క్లీన్ చేసి, ఇంటికి తాళం వేసి రైల్లో ఒడిశాలోని తన సొంత ఊరికి వచ్చినట్లు తెలిపాడు.
ఇలా ఈ హత్యోదంతంపై లేఖరాసి.. చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న లేఖతో పాటు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై దుశిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెసిన స్థానికులు... ఈ నెల 24 రాత్రి టూవీలర్ పై బయటకు వెళ్లిన రాయ్.. మరుసటి రోజు కుళేవాడ శ్మశానవాటికలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని అన్నారు. మహాలక్ష్మీ – ముక్తిరంజన్ రాయ్.. ఇద్దరూ ఓ సంస్థలో పనిచేస్తున్నారని.. ఇద్దరూ సహజీవనం సాగించారని చెబుతున్నారు.
ఈ క్రమంలో.. ఆ ఫ్యాక్టరీలో టీం మేనేజర్ గా పనిచెస్తున్న రాయ్... ఇతర అమ్మాయిలతో చనువుగా మాట్లాడటం ఆమెకు ఆగ్రహం తెప్పించేదని.. దీంతో ఆమె తరచూ గొడవకు దిగేదని తేలిందని అంటున్నారు. ఈ నెపథ్యంలోనే ఈ నెల 21 సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కి చేరి ఈ హత్యకు దారితీసిందని అంటున్నారు!