ప్రభుత్వంలో పవన్ పాత్ర ఏంటి.. పరిమితమా..?
అయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు కేంద్రం రెడీ అయింది.
తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర పరిమితమా? అపరిమితమా? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. దీనిపై ఎవరి యాంగి ల్‌లో వారు సమాధానం చెబుతున్నారు. కానీ, వాస్తవం ఎలా ఉన్నా.. పవన్ అనుసరిస్తున్న తీరు.. స్పంది స్తున్న తీరు చూస్తే మాత్రం.. తనకు తానే కొన్ని రేఖలు గీసుకుని ఆ హద్దుల్లోనే ఉండి పోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. పలు కారణాలు వీటిని నిజం చేస్తున్నాయి కూడా.
+ ప్రస్తుతం కేంద్రంలోనూ జనసేన భాగస్వామిగానే ఉంది. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరిద్దరూ కూడా.. మోడీ సర్కారుకు మద్దతుగా ఎన్డీయే కూటమిలో ఉన్నారు. అయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు కేంద్రం రెడీ అయింది. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీకి రావాల్సిన అంశాలు.. నిధుల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ విషయంలో పవన్ కూడా.. స్పందించాలని .. స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బడ్జెట్కు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
+ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా నాలుగు రోజులుగా.. మహిళలపై ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాజకీయ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్కారుకు మద్దతుగా మాట్లాడేవారు.. మౌనంగా ఉన్నారు. నిజానికి ఒకప్పుడు మద్దతుగా అనేక గళాలు వినిపించాయి. కానీ, ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఈ పరిణామాల సమయంలో డిప్యూటీ సీఎంగా పవన్ స్పందించకపోవడాన్ని ఆయన గీసుకున్న గీతల్లో ఈ అంశం లేదేమో.. అనే భావనను కలిగిస్తోంది.
+ విశాఖలో వెలుగు చూసిన ఎర్రమట్టి(భీమిలి నియోజకవర్గం) దిబ్బల వ్యవహారం.. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ మట్టి దబ్బలను చదును చేస్తున్నారని.. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. వాస్తవానికిఈ విషయాన్ని వెలుగు లోకి తీసుకు వచ్చింది... జనసేన నాయకుడు బొలి శెట్టి సత్యనారాయణ. అయితే.. ఈ విషయంలో పవన్ స్పందించాల్సి ఉన్నా.. అత్యంత వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఇలా.. అనేక విషయాల్లో పవన్ మౌనంగా ఉండడాన్ని చూస్తే.. కూటమి సర్కారులో ఆయన పరిమిత పాత్రనే కొరుకుంటున్నారనే భావన వ్యక్తమవుతోంది.