మగాడు మాజీ మన్మధుడు కావొద్దంటూ ఇది చదవాల్సిందే

ఇప్పుడున్న ఆధునిక జీవనశైలితో ఈ హార్మోన్ ఉత్పత్తి మీద ప్రభావాన్ని చూపుతుంది. అదే అనేక సమస్యలకు కారణమవుతుంది. చెప్పుకోలేని బాధను తీసుకొస్తుంది.

Update: 2024-08-11 06:45 GMT

ఏమిటీ టెస్టోస్టిరాన్..? మగాడికి దీనికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? అన్న సందేహాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే.. మగాడికి.. మహిళకు మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసేదే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్. టీనేజ్ లో మీసాన్ని.. యవ్వనంలో రోషాన్ని ఇచ్చేది ఇదే. బెడ్రూంలో వీరత్వం చూపే అపర మన్మథుడ్ని.. ఉత్తుత్తి మన్మథుడిగా మార్చే శక్తి దీనికి మాత్రమే సొంతం. ఈ హార్మోన్ ఉత్పత్తి కాస్త తగ్గితే చాలు మగాడికి వచ్చి పడే కష్టాలు పగోడికి కూడా రాకూడదనిపిస్తుంది. మరి.. అలాంటి కీలక హార్మోన్ ఉత్పత్తి మీద దెబ్బ పడేలా ఉండకూడదంటే చాలానే చేయాలి. చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇప్పుడున్న ఆధునిక జీవనశైలితో ఈ హార్మోన్ ఉత్పత్తి మీద ప్రభావాన్ని చూపుతుంది. అదే అనేక సమస్యలకు కారణమవుతుంది. చెప్పుకోలేని బాధను తీసుకొస్తుంది. కండబలాన్ని ఇచ్చి.. శక్తివంతుడ్ని చేసి.. తిరుగులేనోడిగా మార్చే ఈ హార్మోన్ లెక్కల్లో కాస్తంత తేడా వచ్చినా మొదటికే మోసం ఖాయం. గుండెబలాన్ని.. ఉద్వేగాల పరంగా బలంగా ఉండేలా చేసే ఈ మేజిక్ హార్మోన్ కు సంబంధించి ఒక లెక్క ఉంది.

ప్రతి డెసీలీటరు రక్తంలో 300 నానో గ్రాముల కంటే తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్ హార్మోను ఉన్నప్పుడు దాన్ని హైపోగోనాడిజంగా పరిగణిస్తారు. మగాడు ఎవరైనా నలభై దాటాక ఏడాదికి ఒక శాతం చొప్పున టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి మందగిస్తుంది. అరవై తర్వాత మరింత వేగంగా పడిపోతుంది. కానీ.. ఆధునిక జీవనశైలితో నలభైల్లోనే డేంజర్ మార్కులోకి పడి.. మగాడ్ని డీలా పడేస్తుంది. మరీ సమస్యకు పరిష్కారం ఏంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే చాలా చాలా పెద్దది. దాన్ని సింఫుల్ గా చెప్పే ప్రయత్నం చేశాడో పెద్దమనిషి. అతడి పేరు.. ఫ్రాన్సిస్.

ఇంతకీ అతడి గొప్పతనం ఏమిటన్న సందేహం రావొచ్చు. ఇతగాడు.. ‘‘కంప్లీట్ గైడ్ టు టెస్టోస్టిరాన్’’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత. తన జీవితానుభవాన్ని రంగరించి ఈ పుస్తకంలో విలువైన సూచనలు చేశాడు. వీటిని చదివి అవగాహన పెంచుకోవటమే తప్పించి.. ఇలానే చేయాలని మేం రికమెండ్ చేయట్లేదు. ఎవరికైనా ఈ సమస్య ఉంటే.. వైద్యుల పర్యవేక్షణలో వారి సూచలనకు తగ్గట్లు ఫాలో కావాలి. కాకుంటే.. అవగాహన పెంచుకోవటానికి ఇలాంటి సమాచారం చదవటం మంచిది.

టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంపొందించుకోవటానికి.. దాని ఉత్పత్తికి దెబ్బ పడకుండా ఉండేందుకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలకు వస్తే..

- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో వచ్చిన పాక్షిక ఉపవాసం. అదేనండి రోజులో పదహారు గంటలు తినకుండా నోటికి తాళం వేయటం.. మిగిలిన ఎనిమిది గంటల్లోనే తినాల్సింది మితంగా తినేయటం.

- నిద్రలో ఉన్నప్పుడే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. అందుకే.. కలత నిద్రకు చెక్ చెప్పి.. కంటినిండా హాయిగా డీప్ స్లీప్ తో ఈ హార్మోన్ ఉత్పత్తికి సహకారం అందిచొచ్చు.

- పర్ ఫ్యూమ్ ల తయారీలో వాడే రసాయనాలు.. ఈ హార్మోన్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి. సో.. కొనే ముందు కేర్ ఫుల్ గా ఎంపిక చేసుకోవాలి.

- మిగిలిన బాడీతో పోలిస్తే.. వృషణాలకు కొంత చల్లని వాతావరణం అవసరం. బిగుతైన డెనిమ్స్ కారణంగా.. ఆ భాగంలో గాలి చొరబడని పరిస్థితి. దీని కారణంగా ఈ కీలక హార్మోన్ ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది.

- భోజనంలో అల్లం.. వెల్లుల్లి.. ఉల్లి.. ఆలివ్ ఆయిల్ మొదలైన వాటితో టెస్టోస్టిరాన్ ను మెరుగుపర్చుకునే వీలుంది. సో.. మగాడు మాజీ మన్మధుడిగా మారొద్దంటే.. మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిందే బాస్.

Tags:    

Similar News