'పతంజలి' చేసుకున్న పాపం ఏంటి?
దీంతో గత రెండు రోజులుగా పతంజలి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
పతంజలి.. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన వార్త. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో సైతం.. పతంజలి అధిపతి బాబా రామ్‌దేవ్ వ్యవహారాన్ని ఫస్ట్ పేజీల్లోనే ప్రస్తావించారు. ఆయనపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం.. క్షమాపణలు చెబుతామన్నా.. కాదు పొమ్మనడం.. సుప్రీంకోర్టు తీసుకునే చర్య లకు సిద్ధంగా ఉండాలని ఆదేశించడం తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా పతంజలి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
కోర్టు ఆదేశాలు.. తీర్పుల విషయం పక్కన పెడితే.. అసలు ఈ కేసులో రాజకీయ రంగు ఉండడమే ఇప్పు డు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సరే.. అసలు అభియోగం ఏంటంటే.. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు.. బాబా రాందేవ్.. ఇంగ్లీష్ మెడిసిన్ (అల్లోపతి) పై విమర్శలు చేశారు. దీనిని ఎవరూ కాదనరు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఆయుర్వేదాన్ని బాగా ప్రమోట్ చేశారు. ఈ సమయం లోనే ప్రధాని నరేంద్ర మోడీ కరోనాకు వ్యాక్సిన్ రూపొందించారు.
దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా 130 దేశాలకు పంపిణీ కూడా చేశారు. అయితే.. ఇదేసమయంలో బాబా రాందేవ్.. కరోనా వ్యాక్సిన్‌పైనా సందేహాలు వ్యక్తం చేశారు. ఇవి.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సహా... ఎక్కడో ఉన్న బ్రిటన్, ఇథియోపియా దేశాలకు కూడా పాకాయి. దీంతో బంగ్లాదేశ్.. రెండు టన్నుల డోసులను, బ్రిటన్ పూర్తిగాను.. ఇథియోపియా తమకు వద్దని వ్యాక్సిన్‌ను పంపించి వేశాయి. ఇది రాం దేవ్ బాబాపై కేంద్రానికి మంట పుట్టించేలా చేసింది.
మరోవైపు.. గతంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాందేవ్‌ను భుజాలపై మోసింది. కాంగ్రెస్‌కు ఆయన అనుకూలంగా ఉన్నాడనేది మరో మంట. వీటికితోడు మోడీ నిర్ణయాలను పరోక్షంగా విమర్శించే వారిలో నూ బాబా ఉన్నారు. అంతేకాదు.. ఫ్రాచైజీలు కూడా.. బీజేపీ మూలాలు ఉన్నవారికి కాకుండా.. దేశవ్యాప్తం గా కాంగ్రెస్ మూలాలు ఉన్నవారికి అప్పగించారనేది మరో కీలక ఎలిగేషన్. ఈ నేపథ్యమే పతంజలి పాపానికి కారణమైందనేది పరిశీలకుల అంచనా.
వాస్తవానికి అల్లోపతిని వ్యతిరేకిస్తూ.. అనేక యాడ్స్ ఇప్పటికీ వస్తుంటాయి. అయినా.. వాటిపై కాకుండా.. కేవలం బాబా రాందేవ్‌ను టార్గెట్ చేసుకోవడానికి కారణం.. పైవాటితోపాటు.. ప్రమోషన్‌కు సహకరించకపోవడమే. సో.. ఇదీ.. కథ. అయితే.. సుప్రీంకోర్టును ఎవరూ తప్పుబట్టరు. కానీ, దీని వెనుక ఉన్న ఫిర్యాదు.. దాని మూలాలను కనుక కదిలిస్తే.. ఎక్కడ డొంక కదులుతోందన్నది ప్రధానం. ఇదే అసలు విషయం.