రైట్ రైట్... ఉచిత బస్సు మీద బాబు గుడ్ న్యూస్

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు.

Update: 2024-11-19 10:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మరో కీలక హామీను నెరవేర్చే పనిలో పడిందా అంటే అవును అని అంటున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ఆ విధంగా ప్రచారం చేశారు.

దానికి మహిళలు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. కూటమికి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు టర్న్ అయినది కూడా ఉచిత బస్సు పధకం హామీ మీదనే అన్న చర్చ కూడా ఉంది. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదు నెలలు దాటింది. ప్రస్తుతం ఆరో నెల నడుస్తోంది.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ హర్షించారు. ఆ మీదట ఎవరూ కోరకుండానే అన్నా క్యాంటీన్లు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అవి ఇపుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి.

ఇక దీపావళి కానుకగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీను కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. దాంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కాస్తా ముందూ వెనకా అయినా సూపర్ సిక్స్ హామీలు అన్నీ నెరవేర్చి తీరుతారు అని.

మరో వైపు చూస్తే జమిలి ఎన్నికలు అంటున్నారు. 2027 మొదట్లో ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. దాంతో గట్టిగా రెండేళ్ల కాల పరిమితి మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో మిగిలిన హామీలను కూడా వరస క్రమంలో అమలు చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ సమావేశంలో ఉచిత బస్సు హామీ మీద కీలక చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా కర్ణాటకలలో అధికరులు వెళ్ళి అక్కడ ఫ్రీ బసు పధకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేసి వచ్చారు. దాని మీద నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. మరో వైపు ఏపీలో కొత్తగా 1400 బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఉచిత బస్సు పేరుతో మహిళలకు వాటిని కేటాయించాలని భావిస్తోంది. ఈ ఉచిత బస్సు వల్ల పురుషులు ఇబ్బంది పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉచిత బస్సు పధకం వల్ల ఇతర రాష్ట్రాలలో ఆటో వాలాలు కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో ఎవరికీ ఈ పధకం వల్ల ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని వైపుల నుంచి చూసుకుంటూ పకడ్బందీగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది.

ఉచిత బస్సు పధకానికి బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు. దాంతో కొత్త ఈఅడాది అంటే 2025 సంక్రాంతి నుంచి ఉచిత బస్సు సదుపాయాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. దానిని మంత్రివర్గంలో పెట్టి చర్చించి ఒక ఆమోదానికి వస్తారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో రైట్ రైట్ అంటూ ఉచిత బస్సులు సంక్రాంతి నుంచి రంగంలోకి రానున్నాయి. అసలే తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతిగా ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణాలు మరీ ఎక్కువగా చేస్తారు. ఆ కీలకమైన సమయంలో కనుక ఫ్రీ బస్ పెట్టి ఓన్లీ ఫర్ లేడీస్ అంటే కూటమి ప్రభుత్వానికి లేడీ సెంటిమెంట్ పీక్స్ లో దక్కుతుందని భావిస్తున్నారు.

మొత్తానికి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎక్కడా పక్కకు జరగడం లేదు, పైగా వాటిని ఒక టైం ప్రకారం చూసుకుంటూ అన్నీ అనుకూలించ వేళ అమలు చేస్తున్నారు అని అంటున్నారు. సో ఏపీలో మహిళలకు బాబు ఇచ్చే మరో గిఫ్ట్ రెడీ అవుతోది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News