ఏపీలో పొలిటికల్ హీట్ పెంచనున్న ఆ డేట్ !?

దాని బలాన్ని మ్యాచ్ చేయడానికో లేదా పైచేయి సాధించడానికో టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది.

Update: 2024-05-21 01:30 GMT

ఏపీ ఎన్నికలు భీకరంగా సాగాయి. ఒక విధంగా చెప్పాలంటే కురుక్షేత్ర మహా సంగ్రామాన్నే తలపించాయి. అటూ ఇటూ మోహరించి మరీ భారీ యుద్ధమే చేశారు. వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. దాని బలాన్ని మ్యాచ్ చేయడానికో లేదా పైచేయి సాధించడానికో టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది.

దాంతో ఎవరూ ఎక్కడా తీసిపోని తీరులో పెద్ద ఎత్తున ఎన్నికల సమరమే సాగింది. ఇక ఎన్నికల ఫలితాలకు పట్టుమని పద్నాలుగు రోజులు వ్యవధి మాత్రమే ఉంది. దాని కంటే ముందు జూన్ 1 వ తేదీన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వస్తాయి. దాంతో ఏపీలో ఎవరు ఏమిటి అన్నది ఒక అంచనాకు అయితే రావచ్చు. చాలా సార్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజాలు అయ్యాయి.

పొరుగున ఉన్న తెలంగాణాలో సైతం అత్యధిక శాతం ఫలితాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అదే జరిగింది. సో అందరి చూపూ జూన్ 1వ తేదీ మీదనే ఉంది. ఆ రోజున సాయంత్రం అయిదు గంటలతో ఏడవ విడత ఎన్నికల పోలింగ్ పూర్తి అవుతుంది. అంటే మొత్తం లోక్ సభ ఎన్నికలు ముగిసినట్లే.

దాంతో ఎగ్జిట్ పోల్స్ కి అనుమతి లభిస్తుంది. అంతే వరసగా సాయంత్రం ఆరు గంటల నుంచి రకరకాలైన ఎగ్జిట్ పోల్స్ ప్రసారం అవుతాయి. ఒక అంచనా ప్రకారం చూస్తే ఏఅపీ ఎన్నికల విషయంలో కనీసంగా లోకల్ రీజనల్ నేషనల్ వైడ్ గా చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు యాభై దాకా ఉండవచ్చు అని అంటున్నారు.

ఏపీ ఎన్నికలు దేశంలోనే ఉత్కంఠ రేపిన మాట వాస్తవం. దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు మరో మూడు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కానీ వీటన్నిటిలో ఏపీ పెద్ద స్టేట్ కావడం ఒకటైతే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది దేశంలోనూ అతి పెద్ద చర్చగా ఉంది. సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఈ ఇద్దరూ కూడా జాతీయ స్థాయిలో ప్రముఖులుగా ఉన్న వారే.

అనాడు కాంగ్రెస్ ని సోనియా గాంధీని ఎదిరించి జగన్ నేషనల్ వైడ్ పొలిటికల్ ఫిగర్ అయ్యారు 2019లో 151 సీట్లతో మరోమారు చర్చకు వచ్చారు. ఇక చంద్రబాబు గడచిన మూడు దశాబ్దాల కాలంగా జాతీయ స్థాయిలో ప్రముఖుడిగానే ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీకి కూడా ఈ ఇద్దరు నేతలూ అవసరం ఉంది కాబట్టి జాతీయ మీడియా ఫోకస్ అంతా ఏపీ మీదనే ఉంటోంది.

దాంతో ఎవరు పవర్ తీసుకుంటారు అన్న దాని మీద లెక్కకు మిక్కిలిగా ఎగ్జిట్ పోల్ సర్వేలు జూన్ 1న సాయంత్రం ఆరు నుంచే బయటకు రానున్నాయి. ఇందులో కూడా వైసీపీకి టీడీపీకి అనుకూలంగా వచ్చేవి ఉంటాయి. అయితే ఎవరికి ఎక్కువ ఫేవర్ గా వచ్చాయి అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే సర్వే చేసిన సంస్థల ప్రామాణికత, వారు చెప్ప అంశాలు లాజిక్ కి అందుతున్నాయా లేవా అన్నది కూడా అటు జనాలు ఇటు రాజకీయ జనాలు నిర్ణయించుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా పొలిటికల్ హీటెస్ట్ డే గా మాత్రం జూన్ 4 ఎటూ ఉంటుంది కానీ దానికి సరిసమానంగా జూన్ 1 తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ రోజున ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News