అక్రమ వలసదారులపై వాలెంటైన్స్ డే పోస్ట్.. ఇండియన్స్ నెక్స్ట్ ట్రిప్ రెడీ!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సీరియస్ నెస్ పీక్స్ అనే సంగతి తెలిసిందే.

Update: 2025-02-15 05:56 GMT

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సీరియస్ నెస్ పీక్స్ అనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆయన ముందుకు కదులుతున్నారు.. ఈ విషయంలో నో మొహమాటమ్స్ అని చెప్పకనే చెబుతున్నారు. ఈ సమయంలో వాలెంటైన్స్ డే నాడు ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

అవును... అక్రమ వలసదారుల విషయలో ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. వాలెంటైన్స్ డే సందర్భంగా అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. వైట్ హౌస్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టడం గమనార్హం. ఈ పోస్ట్ లో ట్రంప్ తో పాటు బోర్డర్ చీఫ్ థామస్ హోమన్ ఫోటో కూడా ఉంది.

ఈ సందర్భంగా ఆ పోస్ట్ లోని ఓ గులాబీ రంగు గ్రీటింగ్ కార్డులో... "గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి.. వైలెట్ లు నీలి రంగులో ఉంటాయి.. చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తే బహిష్కరిస్తాం" (రోజెస్ ఆర్ రెడ్.. వైలెట్స్ ఆర్ బ్లూ.. కమ్ హియర్ ఇల్లీగల్లీ.. అండ్ వియ్ విల్ డిపోర్ట్ యూ) అంటూ రాసుకొచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే... భారత్ కు రెండో ట్రిప్ సిద్ధం చేశారు.. ఆదివారం వారు అమృత్ సర్ కు రాబోతున్నారు. తొలుత 104 మంది అక్రమ వలసదారులతో ఫస్ట్ ఫ్లైట్ టెక్సాస్ టు అమృత్ సర్ రాగా.. ఇప్పుడు మరో అమెరికా వలస విమానం 119 మందితో అదే పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆదివారం ల్యాండ్ కాబోతోందని చెబుతున్నారు.

సీ-17 గ్లోబ్ మాస్టర్ 3 యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఈసారి రాబోయే 119 మందిలో 67 మంది పంజాబ్ కు చెందినవారు కాగా.. మిగిలినవారిలో హర్యానా (33), గుజరాత్ (8), ఉత్తర ప్రదేశ్ (3), మహారాష్ట్ర (2), రాజస్థాన్ (2), గోవా (2), జమ్మూ కశ్మీర్ (1), హిమాచల్ ప్రదేశ్ (1) వాసులు ఉన్నారు.

కాగా.. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదాస్పదమైంది. మరి తాజాగా ట్రంప్ తో మోడీ భేటీ అయిన వేళ.. ఈ సారి ట్రీట్ మెంట్ మారుతుందా.. లేక, తమ్ముడు తమ్ముడే అనే స్థాయిలో సేమ్ ట్రీట్ మెంట్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News