బాబు 'కుర్చీలో టవల్' పై యూపీలో పెద్ద గొడవ!

అవును... రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాల్లో ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు)కు టవల్ తో అలంకరించబడిన కుర్చీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2024-11-22 03:49 GMT

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అక్కడ వేదికపై ఆయన కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీని ప్రత్యేకంగా అలంకరించడంపై అభ్యంతర వ్యక్తం చేశారు.

తాను కూర్చునే కుర్చీని ప్రత్యేకంగా అలంకరించడంపై స్పందించిన ఆయన... తాను కూర్చినే కుర్చీకి అదనపు హంగులు ఏమీ అవసరం లేదని.. ఆ కుర్చీపై ఉన్న తెల్లటి గుడ్డ (టవల్) ను తీయించేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే.. యూపీలో దీనికి పూర్తి విభిన్నమైన ఇష్యూ జరింది!

అవును... రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాల్లో ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు)కు టవల్ తో అలంకరించబడిన కుర్చీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 6న జరిగిన రాష్ట్ర పార్లమెంటరీ మానిటరింగ్ కమిటీ సమావేశం తర్వాత అవిధేయతపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పంకజ్ మాలిక్... శాసనసభ్యులకు సాధారణ కుర్చీలు ఇస్తారు, అధికారులు తెల్లటి టవల్స్ తో కూర్చుంటారు.. అధికారులు శాసనసభ్యులను గౌరవించలేకపోతే.. ఇక వారు ప్రజలను ఎలా మంచిగా చూస్తారు అని అన్నారు.

ఇదే సమయంలో... సమావేశాల్లో ఎమ్మెల్యేలకు సాధారణ కుర్చీలు ఇస్తూ.. అధికారులు సోఫాలపై కూర్చున్నారని.. ఇటువంటి ట్రీంట్ మెంట్ తీవ్ర అభ్యంతరకరం అని అంటున్నారు. దీంతో... ఇకపై ప్రోటోకాల్ ను ఉల్లంఘించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారంట.

కాగా లక్నోలోని ఉత్తరప్రదేశ్ సచివాలయం వారానికి రెండుసార్లు (సోమ, గురువారాల్లో) సుమరు 1,000 టవల్స్ ని మారుస్తుందని.. వీటిలో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ మినహా మిగిలిన వారికి అంతా తెల్లటి టవల్స్ వేస్తారని.. సీఎంకు మాత్రం కుంకుమపువ్వు రంగు టవల్ ని వాడతారని చెబుతున్నారు!

Tags:    

Similar News