కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం..?

మరోపక్క కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ చతికిలపడిపోయిందని అంటున్నారు.

Update: 2024-11-23 09:32 GMT

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ మహాయుతి కూటమి మ్యాజిక్ చేస్తూనే ఉంది! ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాలను మించి ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోపక్క కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ చతికిలపడిపోయిందని అంటున్నారు.

తాజా ఫలితాల అప్ డేట్ ప్రకారం... మహాయుతి కూటమి ఇప్పటికే 63 స్థానాల్లో విజయం సాధించగా, మరో 160 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బీజేపీ ఆఫీసుకు మిఠాయిలు వచ్చేశాయి. మరోపక్క బాణాసంచా, అగ్గి పెట్టెలు సిద్ధం చేసుకుని ఉన్నారని, డీజేలు వచ్చేస్తున్నాయని అంటున్నారు.

ఈ సమయంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నుంచీ సీఎం అభ్యర్థి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉండొచ్చని అంటున్నారు. మరోపక్క ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ పేరు తెరెపైకి వస్తోందని అంటున్నారు.

ఈ సమయంలో స్పందించిన బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్... బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర కు కాబోయే సీఎం అని, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. మరోవైపు ఆదివారం ముంబైకి బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలకులను పంపనుందని అంటున్నారు.

మరోపక్క మరాఠాలకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఏక్ నాథ్ షిండే నే మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఏక్ నాథ్ షిండే మరాఠా గౌరవానికి చిహ్నంగా మారారని.. సాధారణ మరాఠా ఓటరు భావించడమే ఈ ఘన విజయానికి కారణం అని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఎక్కువ సీట్లు వచ్చినవారే సీఎం కావాలని లేదంటూ షిండే చేసిన వ్యాఖ్యలను ప్రస్థావిస్తూ అజిత్ పవార్ సైతం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ... పార్టీ జాతీయ నాయకత్వానికి వేధియుడిగా ఉంటూ, ఆరెస్సెస్ మద్దతు ఉన్న ఫడ్నవీస్ పేరే ముందు వరుసలో ఉందని అంటున్నారు.

ఈ సమయంలో వారు మయాయుతి కూటమి పార్టీలతో చర్చలు జరపనున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గెలిచిన కూటమి మరో 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో... ఈ రోజు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు భేటీ కానున్నారు.

Tags:    

Similar News